రైతు బజార్ కు భూమిపూజ
కడప ఫిబ్రవరి 5
గిట్టుబాటుధరలేనప్పుడురైతులకు గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వమేకొనుగోలుచేస్తుందరని ప్రభుత్వ ఛీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. బుధవారం నాడు రాయచోటి పట్టణంలోని సిరికల్చర్ సెంటర్ ఆవరణలో రైతు బజార్ ఏర్పాటుకు అయన భూమిపూజ చేశారు. శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్్ జగన్ మోహన్ రెడ్డి రాయచోటి పర్యటనలోదాదాపు రెండు వేల కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారని, దాదాపు అన్ని పనులు ప్రారంభం అయ్యాయని అన్నారు. ఇందులో భాగంగానే కోటిరూపాయలవ్యయంతో 60 షాపులు ఏర్పాటు చేసే విధంగా రైతుబజార్ ను నిర్మించడంజరుగుతుందన్నారు. రాయచోటిలో ప్రస్తుతం వున్న కూరగాయల మార్కెటును, రైతుబజారును సమానంగాఅభివృద్ధిచేస్తామని అన్నారు. ప్రజలకు అన్ని ఒకేచోట తాజాకూరగాయలు, నిత్యవసర సరుకులు దోరికేల సులభతరం చేస్తామన్నారు. గాలేరు-నగరి, హంద్రీ-నీవా పనులకు డిపిఆర్లు తయారయ్యాయని త్వరలోనేటెండర్లు పిలుస్తామన్నారు. పోలీసుశాఖకు సబ్ డివిజన్ పూర్తయ్యిందని గతంలో డియస్పీతో పనివుంటే పులివెందుల వెళ్ళాల్సివచ్చేదని, వారం రోజుల్లో రాయచోటికి డియస్పీని నియమించడంజరుగుతోందన్నారు.అలాగే పిజి సెంటర్, గాలివీడు డిగ్రీ కాలేజీ, మహిళాడిగ్రీకళాశాల, డైట్ వసతిగృహానికి సంభందించిన ప్రణాళికలు చివరి దశకు వచ్చాయని అన్నారు. పనులన్ని మార్చిలో ప్రారంభమయ్యేల లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. దళారి వ్యవస్థను రూపుమానాలన్నలక్ష్యంతో రైతుల్లోఅవగాహన పెంచి, మార్కెట్ యార్డులను బలోపేతంచేసి వైఎస్ జగన్ మద్దతు ధర ప్రకటించారని కొనియాడారు.