ఏపీలో మహిళా రక్షణకు ప్రత్యేకంగా దిశ పోలీస్ స్టేషన్ల విభాగం
దేశంలోనే తొలిసారి.. డిజీపికి గౌతమ్ సవాంగ్
రాజమండ్రి ఫిబ్రవరి 5
దేశంలోనే తొలిసారిగా ఏపీలో మహిళా రక్షణకు ప్రత్యేకంగా దిశ పోలీస్ స్టేషన్ల విభాగం ఏర్పాటు చేసినట్లు డిజీపికి గౌతమ్ సవాంగ్ తెలిపారు. రాజమండ్రిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రతి పోలీసు స్టేషన్ మహిళా ఫ్రెండ్లీ లా వుండేలా చర్యలు చేపట్టాంమన్నారు.18 చోట్ల తొలి సారి దిశ స్టేషన్లు పెడుతున్నాం..ప్రతి జిల్లాకొకటి, అలాగే ప్రతి నగరంలో ఒక్కక్కొటీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.మహిళా , దిశ కేసులలో వేగవంమైన దర్యాప్తు కు అవసరమైన యంత్రాగాన్ని సమకూర్చుకున్నామని చెప్పారు.వారం రోజులలో దిశ కేసులలో దర్యాప్తు పూర్తి చేసి బాధితులకు న్యాయం చేస్తామన్నారు.దిశ కేసులలో పోలీసులు తక్షణమే స్పందించి పరిష్కారానికి ప్రయత్నంచేస్తామన్నారు.దిశ యాప్ కూడా 7 ప్రారంభిస్తాంమన్నారు.మహిళా రక్షణకు ప్రాధాన్యం ఇస్తామన్నారు.కేవలం దిశ కేసులలోనే కాదు.. మహిళలు ఎదుర్కొనే ఏ కేసులైనా సత్వర పరిష్కరించాలనే లక్ష్యం గా వ్యవస్థలో మార్పులు తెస్తున్నామన్నారు.