YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

ప్రత్యేక హోదా పై కేంద్రానికి జగన్మోహన్ రెడ్డి లేఖ

ప్రత్యేక హోదా పై కేంద్రానికి జగన్మోహన్ రెడ్డి లేఖ

ప్రత్యేక హోదా పై కేంద్రానికి జగన్మోహన్ రెడ్డి లేఖ
అమరావతి ఫిబ్రవరి 5
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరోసారి ప్రత్యేక హోదా అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. 2019 ఎన్నికల ప్రచార సమయంలో ... వైసీపీ పార్టీ అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా తీసుకువస్తానని చెప్పిన జగన్ అటువైపుగా అడుగులు వేస్తున్నట్టు అనిపిస్తుంది. తాజాగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని జగన్ సర్కార్ కేంద్రాన్ని కోరింది. పదిహేనవ ఆర్థిక సంఘం నివేదిక నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాలని ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు. దీన్ని సీఎం కార్యాలయం మంగళవారం అర్ధరాత్రి మీడియా కు విడుదల చేసింది. వివిధ రాష్ట్రాలు ప్రత్యేకహోదా కోరుతున్నాయని లేఖలో తెలిపింది . ఇది ఆర్థికసంఘం పరిధిలోని అంశం కాదని.. కేంద్ర ప్రభుత్వమే పరిశీలించి తగు నిర్ణయం తీసుకోవాలని 15వ ఆర్థిక సంఘం తన నివేదిక లో ప్రస్తావించిన విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ గుర్తుచేశారు. విభజనతో ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా ఎంతో నష్ట పోయిందని తెలంగాణ కే ఎక్కువగా ఆదాయం వెళ్లిందన్నారు. అందువల్ల తమ రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేకహోదా ఇచ్చి ఆదుకోవాలని సీఎం జగన్ కోరారు. ఇటీవల పార్లమెంట్లో ప్రవేశ పెట్టిన 15వ ఆర్థిక సంఘం నివేదిక హోదా అంశం కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉందని తేల్చిందని తెలిపిన జగన్.. ఈ విషయంలో మీరే చొరవ తీసుకొని ఏపీ ప్రజలకు న్యాయం చేయాలని జగన్ కోరారు. హోదాతో పాటు ఏపీ అభివృద్ధి కోసం నిధులు కూడా ఇవ్వాలని ఆయన లేఖలో పొందుపరిచారు.ఈ సందర్భంగా తాజాగా కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై కూడా స్పందించారు. కేంద్ర బడ్జెట్ ఎంతో ఆశాజనకంగా ఉన్నా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రం తగిన కేటాయింపులు లేకపోవడంతో రాష్ట్ర ప్రజలు తీవ్ర అసంతృప్తి కి లోనైన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అయితే ఏపీకి ప్రత్యేక హోదా అనేది ముగిసిన అంశం అని హోదా ఇవ్వడం కుదరదు అని ఇప్పటికే పలు సార్లు కేంద్రం స్పష్టం చేసింది. అలాగే మంగళవారం జరిగిన పార్లమెంట్ సమావేశాల్లోనూ ఏపీకి హోదా ఇవ్వడం కుదరదని కేంద్రమంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. మంత్రి హోదా పై వివరణ ఇచ్చిన కొన్ని గంటల సమయంలోనే సీఎం జగన్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం తో దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ప్రస్తుతం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతుండటంతో... ఏపీకి స్పెషల్ స్టేటస్ పై సీఎం విజ్ఞప్తి పట్ల ప్రధాని మోదీ ఏమైనా కీలక ప్రకటన చేస్తారా అనేది వేచి చూడాలి.

Related Posts