YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కేటీఆర్ సిఎం కాదు..డిప్యూటీ సిఎం! 

కేటీఆర్ సిఎం కాదు..డిప్యూటీ సిఎం! 

కేటీఆర్ సిఎం కాదు..డిప్యూటీ సిఎం! 
హైదరాబాద్ ఫిబ్రవరి 5 
తెలంగాణ మంత్రి కేటీఆర్ పేరు గత కొన్ని రోజులుగా రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారుతోంది. తెలంగాణకు కాబోయే సీఎం కేటీఆర్ అంటూ టీఆర్ఎస్ వర్గాల్లో ఎప్పటి నుంచో ఒక ప్రచారం జరుగుతోంది. అలాగే ప్రస్తుతం కేసీఆర్ కేబినెట్ లో మంత్రులుగా ఉన్న పలువురు మంత్రులు సైతం కేటీఆర్ కు సీఎం అయ్యేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని అనేకసార్లు బహిరంగంగానే ప్రకటించారు. కానీ ఎప్పటికప్పుడు ఆ వార్తలు మంత్రి కేటీఆర్ సీఎం కేసీఆర్ కొట్టేస్తూ వచ్చారు. అలాగే మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ ఎస్ ఘనవిజయం తరువాత కేటీఆర్ ను సీఎం చేస్తారనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరిగింది. అయితే కేసీఆర్ మాత్రం దానికి ఇంకా సమయం ఉందంటూ పరోక్షంగా కొన్ని సంకేతాలు ఇచ్చారు.అయితే రాష్ట్ర రాజకీయాలలో తాజాగా ఒక కొత్త చర్చ మొదలైనట్టు తెలుస్తుంది. టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మున్సిపల్ శాఖ మంత్రి గా ఉన్న కేటీఆర్ ని ఒకేసారి సీఎం గా కాకుండా ముందు ఉప ముఖ్యమంత్రిగా చేయాలనీ సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు .. త్వరలోనే ఇందుకు సంబంధించిన కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. అయితే తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు తన కేబినెట్లో ఇద్దరు డిప్యూటీ సీఎంలకు అవకాశం ఇచ్చిన కేసీఆర్... రెండోసారి మాత్రం డిప్యూటీలను నియమించ లేదు. అయితే కేటీఆర్ కోసమే కేసీఆర్ ముందు చూపుతో ఈ నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం కూడా సాగుతోంది.కేసీఆర్ తర్వాత ఎవరన్న ప్రశ్న వచ్చిన ప్రతిసారీ మరో మాట లేకుండా అందరూ చెప్పే ఒకేఒక పేరు కేటీఆర్. 2020 కేటీఆర్ కు అత్యంత కీలకమైన సంవత్సరంగా పార్టీలో పెను మార్పుల సంవత్సరంగా పార్టీలో చర్చ జరిగింది. ఈ నేపథ్యంలోనే ముందుగా కేటీఆర్ కి డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టి ..పూర్తి బాధ్యతలని ఆయనకి అప్పగించి ...జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఐటీ శాఖామంత్రి. పురపాలక మంత్రి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మున్సిపల్ శాఖ మంత్రి ..ఇక మరికొన్ని రోజుల్లో డిప్యూటీ సీఎం ..ఇలా అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చే ఎన్నికల లోపు పార్టీ పూర్తి బాధ్యతలని కేటీఆర్ తీసుకోబోతున్నట్టు పార్టీలో చర్చలు జరుగుతున్నాయి. మొత్తంగా అతి త్వరలోనే తారక రాముడి పట్టాభిషేకం ఖాయంగా కనిపిస్తుంది. మొత్తంగా తెలంగాణ ప్రభుత్వం లో కేసీఆర్ తరువాత నంబర్ 2గా కొనసాగుతున్న కేటీఆర్... ఉప ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు తీసుకుంటే పార్టీలో అధికారికం గా నంబర్ 2 కానున్నారు.

Related Posts