YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అమరావతికి డబ్బులు లేవు : జగన్ క్లారిటీ

అమరావతికి డబ్బులు లేవు : జగన్ క్లారిటీ

అమరావతికి డబ్బులు లేవు : జగన్ క్లారిటీ
విజయవాడ, ఫిబ్రవరి 5  
మూడు రాజధానులు, అమరావతిపై గందరగోళం కొనసాగుతున్న వేళ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానులు ఖాయమని తేల్చి చెప్పారు. విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం.. అమరావతిపైనా క్లారిటీ ఇచ్చేశారు. ప్రభుత్వం దగ్గర అమరావతిని కట్టేందుకు నిధులు లేవన్నారు జగన్. ప్రజల్ని మభ్యపెట్టాలని, గ్రాఫిక్స్ చూపించాలని తాను అనుకోడంలేదని.. రాజధానిపై తాము బాహుబలి గ్రాఫిక్స్ చూపించమన్నారు.విశాఖ అభివృద్ధి చెందిన నగరం అన్నారు జగన్. అమరావతి లెజిస్లేటివ్ రాజధానిగా కొనసాగుతుందని.. సచివాలయం, సీఎం ఆఫీస్, మంత్రులు, హెచ్‌వోడీలు విశాఖలోనే ఉంటాయని క్లారిటీ ఇచ్చారు. అమరావతిలో అభివృద్ధి కొనసాగుతుందని.. పదేళ్లలో విశాఖను అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉందన్నారు.విశాఖలో అభివృద్ధికి అపార అవకాశం ఉందన్నారు సీఎం. ఉద్యోగాల కోసం హైదరాబాద్‌, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా అభివృద్ధి చేసుకోవచ్చని చెప్పుకొచ్చారు. ఏ ప్రాంతానికి అన్యాయం చేయడం లేదని.. అన్ని ప్రాంతాలకు న్యాయం చేస్తున్నామని.. భవిష్యత్ తరాలకు జవాబుదారీగా ఉండాలి అన్నారు. తాను ఎంత చేయగలుగుతానో ఆ వాస్తవాలను మాత్రమే చెబుతాను అన్నారు.అమరావతిలో ఖర్చు చేసే డబ్బులో 10శాతం విశాఖలో ఖర్చు చేస్తే.. పదేళ్లలో హైదరాబాద్, బెంగళఊరుతో విశాఖ పోటీపడుతుంది అన్నారు ఏపీ సీఎం. జపాన్, సింగపూర్ నగరాలను సృష్టించేంత నిధులు మన దగ్గర లేవని తెలుసన్నారు. అమరావతిలో నిర్మాణాలు చేపట్టేందుకు 5200 ఎకరాలే ఉంటాయని.. 5200 ఎకరాల అభివృద్ధికి లక్ష కోట్లు ఎక్కడి నుంచి పెట్టాలని ప్రశ్నించారు.అమరావతిలో రాజధాని నిర్మాణానికి రూ 1.09 లక్షల కోట్లు కావాలన్నారు ముఖ్యమంత్రి. కీలక మౌలిక సదుపాయాలకు ఎకరాకు రూ.2కోట్లు ఖర్చు అవుతుందని.. ఇంత ఖర్చుతో అమరావతిలో రాజధాని నిర్మాణం కష్టమని తేల్చి చెప్పారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో రూ.5వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని గుర్తు చేశారు. మూడు రాజధానులు ఖాయమని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు.
 

Related Posts