YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

రాజ్యసభలో విజయసాయి వర్సెస్ కనకమేడల

రాజ్యసభలో విజయసాయి వర్సెస్ కనకమేడల

 రాజ్యసభలో విజయసాయి వర్సెస్ కనకమేడల
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5  
రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆస్తుల కేసు ప్రస్తావనకు వచ్చింది. ప్రజా ప్రతినిధులపై పెండింగ్‌లో ఉన్న కేసులపై జరిగిన చర్చలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ మాట్లాడారు. జగన్ కేసుల అంశాన్ని సభలో ప్రస్తావించారు. ఏపీ సీఎంపై 11 అవినీతి కేసులు ఉన్నాయని.. ఆయన కోర్టుకు హాజరు కావడం లేదని.. కోర్టుకు రాలేనని పిటిషన్లు వేస్తున్నారని వ్యాఖ్యానించారు.కనకమేడల జగన్ పేరును ప్రస్తావించడంపై రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు అభ్యంతరం తెలిపారు. సభలో లేని వ్యక్తి గురించి ప్రస్తావించొద్దని సూచించారు. ఇలాంటి కీలక చర్చల సమయంలో.. కేవలం సబ్జెక్ట్‌పై మాత్రమే చర్చ జరగాలన్నారు. పేర్లను ప్రస్తావించడం సరికాదని ఎంపీ రవీంద్రకుమార్‌కు చెప్పారు. దీంతో ఆయన కాస్త వెనక్కు తగ్గారు. ప్రజా ప్రతినిధులు, సీఎంలపై ఉన్న కేసుల విచారణకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని వ్యాఖ్యలు చేశారు.ఛైర్మన్, కనకమేడల మధ్య సంభాషణ పక్కన పెడితే.. వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. కనకమేడల ప్రసంగానికి అడ్డు తగిలారు. రాజ్యసభలో జగన్ పేరును ప్రస్తావించడాన్ని తప్పుబట్టారు. వెంటనే కలగజేసుకున్న వెంకయ్య.. తాను ఛైర్మన్ స్థానంలో ఉన్నానని.. ఏవైనా అభ్యంతరాలు ఉంటే తాను చూసుకుంటానని పరోక్షంగా చెప్పారు. ఎంపీల వ్యాఖ్యలపై స్పందించడానికి 'మీరు మంత్రి కాదు' అంటూ వెంకయ్య విజయసాయిని ఉద్దేశించి అన్నారు.

Related Posts