YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

తెరపైకి ధూళిపాల నరేంద్ర భార్య

తెరపైకి ధూళిపాల నరేంద్ర భార్య

తెరపైకి ధూళిపాల నరేంద్ర భార్య
గుంటూరు, ఫిబ్రవరి 6,
దాదాపు మూడు ద‌శాబ్దాలుగా రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పుతున్న గుంటూరు జిల్లా పొన్నూరు నియోజ‌క‌వ‌ర్గా నికి చెందిన ధూళిపాళ్ల ఫ్యామిలీ నుంచి ఈ ద‌ఫా మ‌హిళ రాజ‌కీయ అరంగేట్రం చేస్తున్నారు. 1983 నుంచి రాజకీయాల్లో ఉన్న ధూళిపాళ్ల కుటుంబంలో వీర‌య్య చౌద‌రి ఎమ్మెల్యేగా పొన్నూరు నుంచి విజ‌యం సాధించారు. ఆయ‌న ఎన్టీఆర్ కేబినెట్ లో మంత్రిగా కూడా ప‌నిచేశారు. ఆ త‌ర్వాత రోడ్డు ప్రమాదంలో ఆయ‌న మృతి చెంద‌డంతో ఆయ‌న వార‌సుడిగా ఆయ‌న కుమారుడు ఎంట్రీ ఇచ్చారు. ఆ త‌ర్వాత ఆయ‌న కుమారుడు న‌రేంద్ర కుమార్ వ‌రుస విజ‌యాలు సాధించారు. వ‌రుసగా ఐదు సార్లు టీడీపీ అభ్యర్థిగా ఆయ‌న విజ‌యం సాధించారు. గ‌త ఏడాది జ‌రిగిన సార్వత్రిక ఎన్నిక‌ల్లో మాత్రం ధూళిపాళ్ల న‌రేంద్ర వైసీపీ హ‌వా ముందు ఓడిపోయారు.వైసీపీ నుంచి పోటీ చేసిన కిలారు వెంక‌ట రోశ‌య్య పొన్నూరు నుంచి విజ‌యం సాధించారు. న‌రేంద్ర ఐదుసార్లు గెలిచినా ఈ ఎన్నిక‌ల్లో కేవ‌లం 1000 ఓట్ల స్వల్ప తేడాతోనే ఓడిపోయారు. ఇక‌, అప్పటి నుంచి న‌రేంద్ర కుమార్ పెద్దగా ప్రజ‌ల మ‌ధ్యకు రావ‌డంలేదు. కానీ, ఇప్పుడు ఈ ఫ్యామిలీ నుంచి తొలిసారి మ‌హిళా నాయ‌కురాలు తెర‌మీద‌కి వ‌చ్చారు. ఆమె న‌రేంద్ర కుమార్ స‌తీమ‌ణి ధూళిపాళ్ల జ్యోతిర్మయి. గ‌డిచిన మూడు ద‌శాబ్దాల్లో కుటుంబం మొత్తం రాజ‌కీయాల్లో నే ఉన్నప్పటికీ ఏనాడూ గ‌డ‌ప దాటి బ‌యట‌కు రాని జ్యోతిర్మయి ఇప్పుడు మాత్రం నియోజ‌క‌వ‌ర్గంలో ప్రతి ఒక్కరినీ ఓన్ చేసుకునేందుకు ప్రయ‌త్నిస్తున్నారు.ఈ క్రమంలోనే స్థానికుల స‌మ‌స్యలు తెలుసుకుని వాటిని ప‌రిష్క రించేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. పొన్నూరు స‌హా నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని అన్ని ప్రాంతాల్లోనూ జ్యోతిర్మయి చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. కార్యక‌ర్తల‌ను క‌లుస్తున్నారు. వారి నుంచి వ‌చ్చే ఫిర్యాదుల‌పై ముందుకు క‌దు లుతున్నారు. త‌మ సంగం డెయిరీ హాస్పట‌ల్ ద్వారా పేద‌ల‌కు అవ‌స‌ర‌మైన వైద్య సహాయం అందేలా చ‌ర్యలు తీసుకుంటున్నారు. ఇక కేసుల విష‌యంలో అవ‌స‌ర‌మైతే పోలీసు స్టేష‌న్లకు కూడా వెళ్తున్నారు. ఏ అవ‌స‌రం వ‌చ్చినా నేనున్నానంటూ ప్రతి ఒక్కరికీ అండ‌గా ఉంటున్నారు.దీంతో ఇప్పుడు పొన్నూరు చుట్టుప‌క్కల ప్రాంతాల్లో జ్యోతిర్మ యి పేరు మ‌ర్మోగుతోంది. త్వర‌లోనే గుంటూరు జిల్లా ప‌రిష‌త్ చైర్మన్ జ‌న‌ర‌ల్ సీటు అయి, మ‌హిళ‌కు కేటా యిస్తే, తాను పోటీ చేయాల‌ని ఆమె ఆశిస్తున్నారు. అదే స‌మ‌యంలో పొన్నూరు మునిపిప‌ల్ చైర్‌ప‌ర్సన్ ప‌ద‌వి రేసులోనూ ఉన్నారు. పొన్నూరు ప‌క్కనే ఉన్న సొంత ఊరు చింత‌ల‌పూడి పొన్నూరు మునిసిపాలిటీలో క‌లిపితే ఇక‌, ఈ ప్రాంతంతో ఆమె అనుబంధం మ‌రింత‌గా పెరగ‌నుంది. మొత్తంగా ధూళిపాళ్ల ప్యామిలీ నుంచి వ‌చ్చిన మ‌హిళా నాయ‌కురాలికి ప్రజ‌ల నుంచి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. మ‌రి ఆమె రాజ‌కీయ ప్రయ‌త్నాలు ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతాయో ? చూడాలి

Related Posts