వరంగల్ కలెక్టర్ అమ్రాపాలి కారు జప్తు చేసేందుకు కోర్టు సిబ్బంది కలెక్టరేట్ కు చేరుకున్నారు. ఐసీడీఎస్ భవనానికి సంబంధించి మూడు లక్షల రూపాయల అద్దెబకాయి ఉందని పేర్కొంటూ కోర్టులో దాఖలైన పిటిషన్ ను విచారించిన వరంగల్ రెండో అదనపు సీనియర్ సివిల్ జడ్జి కలెక్టర్ కారను జప్తు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. దీంతో కోర్టు ఆదేశాలను అమలు చేయడానికి కోర్టు సిబ్బంది కలెక్టరేట్ కు చేరుకున్నారు.