YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

కమలం, శివసేన మళ్లీ దోస్తి

కమలం, శివసేన మళ్లీ దోస్తి

కమలం, శివసేన మళ్లీ దోస్తి
ముంబై, ఫిబ్రవరి 6,
ఎవరు ఎప్పుడు ఎటు వెళతారో తెలియదు. ఏ సమయాన ఏం మాయ జరుగుతుందో అసలే తెలియదు. ముఖ్యంగా రాజకీయాల్లో మాత్రం ఇది తరచూ మనకు కన్పిస్తుంటుంది. ముఖ్యంగా మహారాష్ట్ర రాజకీయాల్లో మనం ఊహించిన ట్విస్ట్ లు ఎన్నో చూశాం. మళ్లీ అలాంటి ట్విస్ట్ చోటు చేసుకునే అవకాశముంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎప్పుడైనా ఏదేనా మరాఠా రాజకీయాల్లో జరగవచ్చన్న అంచనాలో ఉన్నారు.మహారాష‌్ట్రలో గత ఎన్నికల్లో బీజేపీ, శివసేన కలసి కూటమిగా పోటీ చేశాయి. ఈ కూటమి హిట్ అయింది. మ్యాజిక్ ఫిగర్ కు అవసరమైన స్థానాలు ఈ కూటమికి వచ్చినా ఇగోల దెబ్బకు ఫట్టయిపోయింది. ముఖ్యమంత్రి పదవి కోసం ఉద్ధవ్ థాక్రే పట్టుబట్టడం, బీజేపీ ససేమిరా అనడంతో శివసేన కూటమి నుంచి వైదొలిగింది. దీంతో రాత్రికి రాత్రి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చీలిక తెచ్చి అజిత్ పవార్ ను తన గూటికి రప్పించుకుంది. ప్రమాణస్వీకారం కూడా ఫడ్నవిస్ చేశారు.అయితే వెంటనే శరద్ పవార్ జోక్యంతో అజిత్ పవార్ తన పదవికి రాజీనామా చేసి తిరిగి ఎన్సీపీలోకి వచ్చారు. వెంటనే శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ లు కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే ఇప్పుడు సంకీర్ణ సర్కార్ ఎటువంటి అసంతృప్తులు లేకుండా సాగుతుంది. బీజేపీకి ఏమాత్రం అవకాశం రానివ్వకూడదని కొద్డోగొప్పో అసంతృప్తులు ఉన్నప్పటికీ ఎన్సీపీ, కాంగ్రెస్ నేతలు సర్దుకు పోతున్నారు. దీంతో బీజేపీ కొత్త ఎత్తుగడను ప్రారంభించింది.తాజాగా బీజేపీ సీనియర్ నేత సుధీర్ మునగంటి వార్ చేసిన వ్యాఖ్యలు దీనికి అద్దం పడుతున్నాయి. అవసరమైతే తాము శివసేనతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. గతంలో ఉన్న స్నేహం రెండు పార్టీల మధ్య కొనసాగే అవకాశముందని కూడా ఆయన జోస్యం చెప్పారు. దీంతో బీజేపీ కుదిరితే శివసేనతో మళ్లీ జత కట్టాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు.

Related Posts