YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం తెలంగాణ

మెట్రో పై అసదుద్దీన్ ఆగ్రహం

మెట్రో పై అసదుద్దీన్ ఆగ్రహం

మెట్రో పై అసదుద్దీన్ ఆగ్రహం
హైద్రాబాద్, ఫిబ్రవరి 6         
హైదరాబాద్‌ మెట్రో రైలు యాజమాన్యంపై ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాతబస్తీలో మెట్రో పనులంటే అంత నిర్లక్ష్యం ఎందుకని ప్రశ్నించారు. ఫలక్‌నుమా వరకు మెట్రో పనులు ఎప్పుడు పూర్తి చేస్తారని ట్విటర్ వేదికగా నిలదీశారు. దీనిపై నెటిజన్లు కూడా విమర్శలు కురిపించారు. ముస్లింలు పన్నులు చెల్లించడం లేదా అంటూ ఓ నెటిజన్ ప్రశ్నించగా.. పాతబస్తీ విషయానికి వచ్చే సరికే ప్రభుత్వాలు ఎందుకు ఇలా చేస్తాయంటూ మరో నెటిజన్ నిలదీశారు.ఎంజీబీఎస్‌ నుంచి జేబీఎస్‌ వరకు మెట్రో పనులు పూర్తి చేయడానికి మీకు నిధులు ఉంటాయి. మరి ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా మార్గంలో పనులు ఎప్పుడు మొదలుపెడతారు. ఎప్పుడు పూర్తి చేస్తారు?’ అని అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు. ఫిబ్రవరి 7న జేబీఎస్-ఎంజీబీఎస్ మార్గం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం అవుతుందంటూ మెట్రో యాజమాన్యం చేసిన ట్వీట్‌కు బదులిస్తూ అసదుద్దీన్ ఈ ట్వీట్ చేశారు. హైదరాబాద్ మెట్రో రైలు సంస్థను ట్యాగ్ చేశారు.హైదరాబాద్ మెట్రో రైలులో కీలక అంకానికి ముహూర్త ఖరారైన విషయం తెలిసిందే. శుక్రవారంసాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్.. జేబీఎస్‌-ఎంజీబీఎస్ మెట్రో మార్గాన్ని ప్రారంభించనున్నారు. దీంతో మెట్రో మొదటి దశలో పాతబస్తీ పరిధిలో 6 కి.మీ. మినహా అన్ని మార్గాల్లో సేవలు అందుబాటులోకి వస్తాయి. కారిడార్ 1, 2, 3 కలిపి మొత్తం 69 కి.మీ. మేర మెట్రో సేవలు అందుబాటులోకి వస్తాయి. అంతేకాకుండా కీలకమైన సికింద్రాబాద్, హైద్రాబాద్ మధ్య మెట్రో కనెక్టివిటీ అందుబాటులోకి రానుండటం విశేషం. ప్రారంభోత్సవ కార్యక్రమానికి టీఆర్‌ఎస్ నేతలు పెద్ద ఎత్తున జన సమీకరణ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.

Related Posts