YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

 కియా అవుట్ అంటూ ప్రచారం.. కొట్టిపారేసిన ప్రభుత్వం

 కియా అవుట్ అంటూ ప్రచారం.. కొట్టిపారేసిన ప్రభుత్వం

 కియా అవుట్ అంటూ ప్రచారం.. కొట్టిపారేసిన ప్రభుత్వం
అనంతపురం, ఫిబ్రవరి 6         
ఏపీ నుంచి కియా మోటార్స్ వెళ్లిపోతోందా.. పొరుగు రాష్ట్రానికి ప్లాంట్ తరలించే ఆలోచనలో ఉందా.. ఇప్పటికే చర్చలు ప్రారంభమయ్యాయా.. అవునంటోంది అంతర్జాతీయ పత్రిక రాయిటర్స్. కియా మోటార్స్‌కు సంబంధించి ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది. కియా ఏపీ నుంచి తరలిపోతోందని.. ప్రాథమికంగా చర్చు ప్రారంభమయ్యాయని చెబుతోంది.కియా మోటార్స్ ఏపీ నుంచి తమిళనాడకు తరలిపోయే అవకాశం ఉందని రాయిటర్స్ చెబుతోంది. తమిళనాడు ప్రభుత్వంతో కియా ప్రతినిధులు చర్చలు జరుపుతున్నాయంటోంది. ఆ సంస్థ కియా ప్లాంట్‌ను రీ లోకేట్ చేసే ఆలోచనలో ఉందని.. వచ్చే వారం సెక్రటరీ లెవల్‌లో సమావేశం జరగనుందని.. ఆ తర్వాత ప్లాంట్ తరలింపుపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉందని రాయిటర్స్ అంటోంది.ఏపీలో ఆ సంస్థకు ఇబ్బందులు ఎదురవుతున్నాయనే ఈ నిర్ణయం తీసుకుందని.. అందుకే ప్లాంట్ తరలించాలని భావిస్తున్నారని తమిళనాడుకు చెందిన కీలక అధికారి కూడా దీన్ని ధృవీకరించినట్లు ఆ పత్రిక కథనాన్ని ప్రచురించింది. కియా తన అనుబంధ సంస్థ అయిన హుందాయ్ ప్రతినిధులతో ఈ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.. ఎందుకంటే ఆ సంస్థకు తమిళనాడులో భారీ కార్ల ఉత్పాదన ప్లాంట్ ఉంది కాబట్టి.. వారి ద్వారా అక్కడి ప్రభుత్వాన్ని సంప్రదించిందని రాయిటర్స్ చెప్పుకొచ్చింది. అయితే దీనిపై హుందాయ్ కంపెనీ కానీ.. తమిళనాడు, ఏపీ సీఎంవోలు కూడా స్పందించడానికి నిరాకరించారని చెబుతోందికియాకు ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొన్ని నిబంధనలు అడ్డంకిగా మారాయట.. అందులో స్థానికులకు 75శాతం ఉద్యోగాల నిబంధన ప్రధానంగా ఇబ్బందిగా మారిందని రాయిటర్స్ చెబుతోంది. అలాగే గత ప్రభుత్వం కియాకు కల్పించిన రాయితీలు, ప్రోత్సహకాల (ఆర్థిక ప్రోత్సాహకాలు, విద్యుత్ సంబంధంమైన టాక్స్‌లు, భూముల కొనుగోళ్ల విషయంలో)పై కూడా జగన్ సర్కార్ సమీక్ష చేయాలని భావిస్తోందట ఇదే మరో కారణంగా చెబుతున్నారట.
తమిళనాడుకు ప్లాంట్‌ను తరలిస్తే లాజిస్టిక్ ఖర్చులు కూడా తగ్గుతాయని కియా భావిస్తోందట. ప్లాంట్ తరలింపుపై ఇప్పటికిప్పుడే క్లారిటీ రాకపోయినా.. కియా ఎంత త్వరగా ఓ రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లగలదో అర్ధమవుతోందంటోంది రాయిటర్స్. అయితే ఈ ప్లాంట్ తరలింపు చర్చలు రహస్యంగా జరుగుతున్నాయని.. తమ పేర్లు చెప్పడానికి ఈ సమాచారం ఇచ్చినవాళ్లు నిరాకరించారంటోంది.ఇదిలా ఉంటే కియా మాత్రమే కాదు ఏ కంపెనీ అయినా ఒక చోట నుంచి మరో చోటికి తరలించాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం మంటున్నారు కొందరు నిపుణులు.. అంతేకాదు రెండేళ్ల క్రితం ప్లాంట్ ఏర్పాటు చేశారని.. అక్కడ పెట్టుబడుల సంగతి ఏంటని గుర్తు చేస్తున్నారు. కానీ కియా సంస్థ తరపు నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. గతేడాది డిసెంబర్‌లో అనంతపురంలో కియా ప్రారంభమయ్యింది. ఈ ప్లాంట్‌తో దాదాపు 12వేలమందికి ఉద్యోగ అవకాశాలు దక్కాయి. ఏడాదికి మూడు లక్షల యూనిట్లు తయారు చేసే కెపాసిటీ ఈ ప్లాంట్ సొంతం.ఇటు సోషల్ మీడియాలో కూడా కియా వ్యవహారం వైరల్ అవుతోంది. ఏపీ నుంచి మరో కంపెనీ వెళ్లిపోతోందంటూ టీడీపీతో పాటూ జనసేన కార్యకర్తలు, నెటిజన్లు ట్వీట్‌లు చేస్తున్నారు. రాయిటర్స్ కథనాన్ని ప్రస్తావిస్తూ జగన్ సర్కార్‌ను టార్గెట్ చేస్తున్నారు. మరి ఈ వ్యవహారంపై ప్రభుత్వం ఎలా స్పందిస్తున్నది చూడాలి. మండిపడ్డ రోజా అనంతపురం నుంచి కియా మోటార్స్ తరలిపోతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతర్జాతీయ మీడియా సంస్థ రాయిటర్స్ కథనంతో కలకలంరేగింది. దీంతో జగన్ సర్కార్ స్పందించింది.. ఈ వార్తల్ని కొట్టిపారేసింది. కియా ఎక్కడికి వెళ్లదని.. రాష్ట్రంలో ఉంటుందని క్లారిటీ ఇచ్చింది. రాయిటర్స్ సంస్థ కథనాలను ఖండిస్తున్నామన్నారు అధికారులు.తాజాగాపై ఈ వ్యవహారంపై ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా కూడా స్పందించారు. కియాపై తప్పుడు ప్రచారం జరుగుతోందని.. ఈ ప్రాజెక్ట్ రాష్ట్రంలోనే కొనసాగుతందన్నారు రోజా. కొంతమంది జర్నలిస్టులు ఇలా నిరాధారమైన వార్తల్ని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. షేమ్ ఆన్ యూ అంటూ ట్వీట్ చేశారు.

Related Posts