YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

15 వేలకే నవజ్యోతిర్లింగ యాత్ర

15 వేలకే నవజ్యోతిర్లింగ యాత్ర

15 వేలకే నవజ్యోతిర్లింగ యాత్ర
హైద్రాబాద్, ఫిబ్రవరి 6         
ఆధ్యాత్మికత లేదా విశ్రాంతిని కోరుకునే పర్యాటకుల కోసం ఐ‌ఆర్‌సి‌టి‌సి అన్ని రకాల ప్రయాణ సేవలను అందిస్తుంది. భారతదేశం అంతటా వివిధ పవిత్ర మతపరమైన ప్రదేశాలకు తీర్ధయాత్రలకు వెళ్లాలనుకునే వారి కోసం ఐ‌ఆర్‌సి‌టి‌సి భారతీయ దర్శన్ అనే ప్రత్యేక రైలును ప్రారంభించింది.దీనిలో భాగంగా ఇప్పుడు మహా శివరాత్రి జ్యోతిర్లింగ యాత్రకు ఐ‌ఆర్‌సి‌టి‌సి శ్రీకారం చుట్టింది. ఈ యాత్రకు సంబంధించి భారతీయ దర్శన్ రైలును ఫిబ్రవరి 19, ఉదయం 12.05 గంటలకు తిరునెల్వేలి నుంచి నడపనున్నారు. దేశంలోని జ్యోతిర్లింగ తీర్ధ యాత్ర మందిరాలకు యాత్రికులను తీసుకువెళ్లిన తరువాత ఈ రైలు మార్చి 2న తిరునెల్వేలికి చేరుకుంటుంది. ఈ రైలు తిరునెల్వేలి, కరూర్, ఈరోడ్, మధురై, దిండిగల్, సేలం, జోలార్ పెట్టై, కట్పాడి, పెరంబూర్, నెల్లూర్, విజయవాడ, వరంగల్ నుండి యాత్రికులకు అందుబాటులో ఉంటుంది.భారత్ దర్శన్ నాన్ ఏసీ రైలు. ఈ ప్యాకేజీ ప్రకారం యాత్రికులకు ఎయిర్ కండిషన్ లేని ధర్మశాలలలో వసతి కల్పిస్తారు. అలాగే వివిధ ప్రాంతాలకు పర్యటించడానికి నాన్ ఏసీ బస్సు రవాణా అందించబడుతుంది. పర్యటనలో యాత్రికులందరికీ శాఖాహార భోజనంను అందిస్తారు. ఈ ప్యాకేజీలో సైట్ సీయింగ్, ట్రావెల్ గైడ్ తో పాటు సెక్యూరిటీ సదుపాయాలు కూడా ఉంటాయి. ఈ పర్యటన మొత్తం 12 రాత్రులు/13 రోజులు సాగుతుంది.ఓంకారేశ్వర్ - మహాకాలేశ్వర్ - సోమనాథ్ - త్రయంబకేశ్వర్ - భీమా శంకర్ - ఘృష్నేశ్వర్ - ఔంధా నాగనాథ్ - పర్లి వైద్యనాధ్ - మల్లిఖార్జున జ్యోతిర్లింగాల తీర్ధయాత్రలను ఈ ప్రయాణంలో పూర్తి చేయవచ్చు. ఈ పర్యటన మొత్తం ఖర్చు అన్ని పన్నులతో కలుపుకుని ఒక్కో ప్రయాణికుడికి రూ.15320లుగా నిర్ణయించారు.ఈ యాత్రలో ముఖ్యంగా యాత్రికులు మహా శివరాత్రి (ఫిబ్రవరి 21) రోజున ఓంకారేశ్వర్ ఆలయంలో జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకోవచ్చు. మరుసటి రోజున యాత్రికులు మహాకాలేశ్వర్ లోని భస్మ హారతిని, ఆ తరువాతి రోజున గుజరాత్ లోని సోమనాథ్ దేవాలయాన్ని దర్శించవచ్చు. ఇలా తమ ప్రయాణంలో యాత్రికులు ప్రతిరోజూ వివిధ మందిరాల్లో ఉన్న జ్యోతిర్లింగాల దర్శనం పొందుతారు.
కల్పించే వసతులు:
- స్లీపర్ క్లాస్ లో రైలు ప్రయాణం
- రాత్రి బస ధర్మశాలల్లో లేదా డార్మిటరీలు లేదా హాల్స్ లో తోటి ప్రయాణికులతో కలిసి పంచుకోవాల్సి ఉంటుంది. యాత్రికులు అక్కడే తయారై పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్లవచ్చు- ఉదయం టీ/కాఫీ, మూడు పూటలా ఆహారం, 1 లీటర్ వాటర్ బాటిల్ రోజుకు అందిస్తారు
- ట్రైన్ లో టూర్ గైడ్ & సెక్యూరిటీ కల్పిస్తారు
- పుణ్యక్షేత్రాల సందర్శనకు రహదారి ప్రయాణం కల్పిస్తారు
మినహాయింపులు:
- ప్రయాణంలో మీ వ్యక్తిగత వస్తువులు లాండ్రీ, మెడిసిన్స్ వంటివి
- స్మారక చిహ్నాలను సందర్శించినప్పుడు ప్రవేశ రుసుము
 టూర్ గైడ్ సేవలు

Related Posts