YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

15 మంది ఎంపీల మెడపై కత్తి

15 మంది ఎంపీల మెడపై కత్తి

15 మంది ఎంపీల మెడపై కత్తి
విజయవాడ, ఫిబ్రవరి 7,
దేశంలో చాలా పకడ్బందీగా పనిచేస్తున్న సంస్థల్లో కేంద్ర ఎన్నికల సంఘం ఒకటని చెప్పక తప్పదు. ఇలాంటి సంస్థల జాబితా తీస్తే... టాప్ ప్లేస్ లో ఈసీనే ఉంటుందని కూడా చెప్పాలి. అలాంటి ఈసీనే మన తెలుగు ఎంపీలు చాలా లైట్ తీసుకున్నారు. ఫలితంగా ఇప్పుడు ఈసీ కొరఢా చేతబట్టేసరికి ఉరుకులు పరుగులు పెట్టక తప్పని పరిస్థితిని కొని తెచ్చుకున్నారు. ఈ తరహా ఇబ్బందులు పడుతున్న మన తెలుగు ఎంపీలో ఏకంగా 17 మంది ఉండగా... వారిలో ఏకంగా 15 మంది ఏపీకి చెందిన వారేనట. మిగిలిన ఇద్దరు ఎంపీలు తెలంగాణకు చెందిన వారంట.అయినా వీరు చేసిన పొరపాటు ఏంటన్న విషయంలోకి వెళితే... మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఆయా పార్టీల తరఫున బరిలోకి దిగిన ఈ 17 మంది ఎంపీలు.. ఎన్నికలు ముగిసి పది నెలలు దాటుతున్నా... ఎన్నికల ప్రచారానికి తాము ఎంత ఖర్చుపెట్టామన్న వివరాలను ఈసీకి సమర్పించలేదట. వాస్తవంగా ఎన్నికలు ముగిసిన 45 రోజుల్లోగా ప్రచారానికి తాము చేసిన ఖర్చును అందరూ ఈసీకి సమర్పించాల్సిందే. ఓడిన వారు 90 రోజుల్లో సమర్పించినా ఫరవా లేదు గానీ... గెలిచినోళ్లు మాత్రం 45 రోజుల్లోనే ఆ వివరాలను ఈసీకి అందజేయాలట. లేదంటే... ఈసీ వారిని అనర్హులుగా ప్రకటించే ప్రమాదం కూడా లేకపోలేదు.ఈ నిబంధన తెలుసో, లేదో గానీ... తెలుగు నేలకు చెందిన 17 మంది ఎంపీలు తమ ప్రచారం ఖర్చులను ఇప్పటిదాకా ఈసీకి అందజేయనేలేదట. ఇలాంటి వారు దేశవ్యాప్తంగా మనోళ్లతో కలుపుకుని ఏకంగా 80 మంది దాకా ఉన్నారట. ఈ వివరాలన్నింటినీ తాజాగా బయటకు తీసిన ఈసీ... తక్షణమే ప్రచార ఖర్చు వివరాలను తక్షణమే తెలపాలని వీరందరికీ నోటీసులు జారీ చేసిందట. అంటే... తక్షణం స్పందించకుంటే... 17 మంది మన తెలుగు ఎంపీలతో పాటు మొత్తంగా 80 మంది మాజీలుగా మారిపోయే ప్రమాదం లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. అనర్హత వేటు కత్తి వేలాడుతున్న ప్రస్తుత తరుణంలో మనోళ్లు ఏ మేరకు జాగ్రత్త పడతారో చూడాలి. 

Related Posts