YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

శనివారం ఢిల్లీ ఎన్నికలు

శనివారం ఢిల్లీ ఎన్నికలు

శనివారం ఢిల్లీ ఎన్నికలు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7, 
 దేశ రాజధాని ఢిల్లీలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి అంతా సిద్ధమైంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకుగానూ శనివారం పోలింగ్ జరుగనుంది. ఇందుకోసం 13,750 పోలింగ్ బూత్ లను ఎన్నికల సంఘం సిద్ధం చేస్తోంది. దాదాపు లక్షమంది పోలింగ్ సిబ్బందిని ఆయా ప్రాంతాల్లో విధులు నిర్వహించనున్నారు. భద్రత కోసం 190 కంపెనీల పారామిలటరీ బలగాలు, 3800 మంది ఢిల్లీ పోలీసులు, 19వేల మంది హోం గార్డులను మోహరింపజేశారు. పోలింగ్ డే కోసం మెట్రో అధికారులు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారుఓటర్ల ప్రసన్నానికి ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌), బీజేపీ, కాంగ్రెస్‌ తమ శక్తియుక్తులను ఒడ్డాయి. రాజకీయాలతోపాటు పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), నిరుద్యోగం వంటి అంశాలను ప్రచారస్ర్తాలుగా చేసుకున్నారు. ప్రచారంలో ప్రధానంగా ఆప్‌, బీజేపీ పోటీపడ్డాయి. ప్రధాని మోదీ రెండు బహిరంగ సభల్లో ప్రసంగించగా, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పలు సభల్లో మాట్లాడారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ సీఎం ఆదిత్యనాథ్‌ తదదితరులు ప్రచారంలో పాల్గొన్నారు. తొలుత అభివృద్ధి నినాదంతో ప్రచారానికి శ్రీకారం చుట్టిన బీజేపీ, తర్వాత షాహీన్‌ బాగ్‌లో సీఏఏ వ్యతిరేక నిరసనకారులను లక్ష్యంగా చేసుకున్నది ఆప్‌  కన్వీనర్‌ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ఆ పార్టీ తరఫున ప్రచారానికి నేతృత్వం వహించారు. కాగా, కేజ్రీవాల్‌ను ‘ఉగ్రవాది’గా బీజేపీ నేతలు పేర్కొనడంపై ఆప్‌ నేతలు 3 రోజులు మౌన ప్రదర్శనలతోపాటు ఇంటింటి ప్రచారం చేశారు. ఆయనను ‘ఢిల్లీవాసుల కొడుకుగా’ నమ్మితే ఆప్‌కు, ‘ఉగ్రవాదిగా’ భావిస్తే బీజేపీకి ఓటు వేయాలని కోరా రు. మరోవైపు గతంలో వరుసగా 3సార్లు ఢిల్లీ పీఠం దక్కించుకున్న కాంగ్రెస్‌ పార్టీ ఈసారీ ప్రచారంలో పోటీపడలేకపోయింది. ఆ పార్టీ నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ మా జీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, కాంగ్రెస్‌ పాలిత రాష్ర్టాల సీఎంలు కూడా ప్రచారం చేశారు. హర్యానాలో మాదిరిగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆశ్చర్యకరమైన ఫలితాలు సాధిస్తామని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత రణ్‌దీప్‌ సుర్జేవాలా పేర్కొన్నారు. హర్యానాలో కొన్ని టీవీ చానెళ్లు రెండు సీట్లు మాత్రమే కాంగ్రెస్‌ గెలుస్తుందన్నాయని, కానీ తాము 31 స్థానాల్లో గెలుపొందామని గుర్తు చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే జరుగుతుందని సుర్జేవాలా చెప్పారు.

Related Posts