YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మండలి రద్దుపై మల్లాగుల్లాలు

మండలి రద్దుపై మల్లాగుల్లాలు

మండలి రద్దుపై మల్లాగుల్లాలు
అంతర్మధనంలో వైసీపీ నేతలు
విజయవాడ, ఫిబ్రవరి 7,
శాసనమండలి రద్దు వల్ల ఎక్కువగా నష్టపోయింది జగన్ అని చెప్పక తప్పదు. పార్టీ పరంగా జగన్ తప్పు నిర్ణయాన్ని తీసుకున్నారంటున్నారు. నాయకత్వం పదికాలాల పాటు మనగలిగితే ఏ పార్టీకైనా భవిష్యత్తు ఉంటుంది. అలాంటి నాయకత్వాన్ని తనంతట తాను తొలిగించేశారంటున్నారు. ఏ నాయకుడైనా పదవుల కోసమే పార్టీలో చేరతారు. పార్టీ సిద్ధాంతాల కోసమో, జగన్ మీద ప్రేమతోనో, జనాన్ని ఉద్ధరించడానికో రాజకీయాల్లోకి రారన్నది కాదనలేని వాస్తవం.ఇప్పుడు శాసనమండలి రద్దుతో వైసీపీలో నాయకులు ఆందోళనలో పడ్డారు. నిజానికి జగన్ అధికారంలోకి రావాలని గత ఎన్నికల్లో నాయకుడి నుంచి కార్యకర్త వరకూ పడిన శ్రమ అంతా ఇంతా కాదు. జగన్ సీఎం కావాలని వైసీపీ లోని కిందిస్థాయి నుంచి పై స్థాయి నేత వరకూ కోరుకున్నారు. అయితే అందరికీ టిక్కెట్లు ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో జగన్ అప్పట్లో కొందరికి ఎమ్మెల్సీల హామీ ఇచ్చారు. వారు దానిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కొందరు తమ నియోజకవర్గాలను కూడా జగన్ మాటకు కట్టుబడి త్యాగం చేశారు. ఇప్పుడు మండలి రద్దు ప్రతిపాదనతో వీరి రాజకీయ భవిష్యత్తు ఆందోళనకరంగా మారింది.బయటకు చెప్పకపోయినప్పటికీ కొందరు వైసీపీ నేతలు జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఏడాదిన్నర ఓపిక పట్టలేక తమ జీవితాలను మరోసారి బుగ్గిపాలు చేశారని శాపనార్థాలు కూడా పెడుతున్నారు. తొమ్మిదేళ్ల నుంచి పార్టీ కోసం కష్టపడుతుంటే చివరకు జగన్ ఇచ్చే బహుమతి ఇదా? అని ప్రశ్నించే వారు లేకపోలేదు. కొందరు ఇప్పటికే విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వంటి నేతల వద్దకు వచ్చి తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు.నిజంగా శాసనమండలిని రద్దు చేయకుండా మూడు, నాలుగు నెలలు జగన్ ఓపిక పట్టి ఉంటే టీడీపీ ఇబ్బందుల పాలయ్యేదని కూడా వారు చెబుతున్నారు. నాలుగు నెలలు వాళ్లు రాష్ట్రంలో ఆందోళనలు చేయలేక చతికలపడే వారని, నాలుగు నెలలు ఉద్యమం చేయలేక టీడీపీ చేతులెత్తేసేదని, కానీ జగన్ ఆ అవకాశాన్ని చేజేతులా కాలదన్నుకున్నారన్న వ్యాఖ్యలు వైసీపీ నుంచే విన్పిస్తున్నాయి. మొత్తం మీద జగన్ అసంతృప్తిగా ఉన్న నేతలకు జగన్ ఎలాంటి పదవులు ఇస్తారో చూడాలి. ఏ పదవులు ఇచ్చినా ఎమ్మెల్సీకి సరికాదన్నది మరికొందరు పెదవి విరవడం విశేషం. మొత్తం మీద శాసనమండలి రద్దు జగన్ పార్టీకే ఎక్కువ నష్టమన్న అభిప్రాయం ఎక్కువగా విన్పిస్తుంది. తనకు నష్టమని తెలిసి కూడా జగన్ ఈ నిర్ణయం వెనక పంతం తప్ప మరే కారణం లేదంటున్నారు.

Related Posts