YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

కార్పొరేట్  కంపెనీలకు డస్ట్ బిన్లు

కార్పొరేట్  కంపెనీలకు డస్ట్ బిన్లు

కార్పొరేట్  కంపెనీలకు డస్ట్ బిన్లు
హైద్రాబాద్, ఫిబ్రవరి 7,
హైద్రాబాద్ మహానగరంలో ప్రతి ఇంటి నుంచి చెత్తను తడి,పొడిగా వేర్వేరుగా సేకరించేందుకు అనేక కార్యక్రమాలను చేపట్టిన జీహెచ్‌ఎంసీ ఇపుడు వాణిజ్య ప్రాంతాలపై దృష్టి సారించింది. కేవలం ఇంట్లోనే గాక, వీధుల్లో, వాణిజ్య సంస్థల నుంచి కూడా చెత్త తడి,పొడి వేర్వేరుగా సేకరించేందుకు ప్రత్యేక ట్విన్ బిన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. నగరంలోని మొత్తం 127 కిలోమీటర్ల మేరకున్న కమర్షియల్ రోడ్లలో ప్రతి 500 మీటర్లకు ఈ ప్రత్యేక ట్విన్‌బిన్లను ఏర్పాటు చేశారు. ఆకుపచ్చ, నీలం రంగుల్లో ఎంతో ఆకర్షనీయంగా కన్పించే ఈ బిన్లను ప్రత్యేక స్టాండ్ను ఏర్పాటు చేసి, వ్యర్థాలను సులువువగా వేసే విధంగా అమర్చారు. మొత్తం 300 డస్ట్‌బిన్లను ఏర్పాటు చేయగా, అధిక శాతం కార్పొరేట్, వాణిజ్య సంస్థల నుంచి సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఉచితంగా సేకరించి వీటిని ఏర్పాటు చేసినట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవలే 75 బిన్లను జీహెచ్‌ఎంసీకి అందజేసింది. దీంతో పాటు స్థానిక వ్యాపార, వాణిజ్య సంస్థల నుంచి ఈ బిన్లను సేకరించి ప్రధాన కమర్షియల్ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. ప్రధానంగా బేగంపేట సర్కిల్‌లో 34, అంబర్‌పేట సర్కిల్‌లో 26, మూసాపేట, హయత్‌నగర్ సర్కిళ్లలో 24 చొప్పున, కాప్రాలో 23, గోషామహల్‌లో 21, ఉప్పల్, సరూర్‌నగర్‌లలో 17 చొప్పున, మల్కాజ్‌గిరిలో 16, ఎల్బీనగర్‌లో 15 చొప్పున ప్రధాన వ్యాపార ప్రాంతాల్లో అందుబాటులో ఉంచారు. చెత్తను తడి,పొడిగా వేరు చేసి ఈ బిన్లలో మాత్రమే వేయాలని అధికారులు వ్యాపార, వాణిజ్య సంస్థలకు సూచించారు. అలవాటయ్యే వరకు కొంత సమయమిచ్చి, ఆ తర్వాత బిన్లలో కాకుండా చెత్తను కింద వేసినా, ఎక్కడబడితే అక్కడ వేసినా జరిమానాలు వసూలు చేయాలని జీహెచ్‌ఎంసీ భావిస్తోంది. కాగా, నగరంలోని పలు ప్రధాన కమర్షియల్ ఏరియాల్లో ఏర్పాటు చేసిన ఈ డస్ట్‌బిన్లు ఆకర్షనీయంగా, ఉపయోగకరంగా ఉన్నాయంటూ కొందరు నగరవాసులు మున్సిపల్ మంత్రి కేటీఆర్‌కు ట్విట్ చేసి అభినందించటం విశేషం.

Related Posts