YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

 నాలుగేళ్లలో  8728 ఇళ్ల నిర్మాణం

 నాలుగేళ్లలో  8728 ఇళ్ల నిర్మాణం

 నాలుగేళ్లలో  8728 ఇళ్ల నిర్మాణం
హైద్రాబాద్, ఫిబ్రవరి 7,
జీహెచ్‌ఎంసీ 2016 ఎన్నికల్లో బల్దియా పీఠం దక్కించుకోవాలని భావించిన అధికార టీఆర్‌ఎస్‌ గ్రేటర్‌ వ్యాప్తంగా డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లను ఉచితంగా నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చింది. లక్ష ఇండ్లకు మొత్తం 97,945 ఇండ్లను బహుళ అంతస్తుల నిర్మాణానికి 114 ప్రాంతాల్లో టెండర్లను పిలిచారు. దాదాపు 47 బస్తీల్లో 9454 గుడిసె వాసులను అధికారులు ఖాళీ చేయించారు. నాలుగేండ్లుగా అద్దెలు చెల్లిస్తూ పలు ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. నాలుగేండ్లుగా నిర్మిస్తున్న డబుల్‌ ఇండ్లల్లో కేవలం 8728 ఇండ్లను మాత్రమే అధికారులు పూర్తి చేశారు. వీటిలో 108 ఇండ్లను ప్రారంభించగా, మరో 8620 ఇండ్లకు నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఇంకా 89,217 ఇండ్లు ఆయా దశల్లో పెండింగ్‌ ఉన్నాయి. వీటిలో మరో 46,279 ఇండ్లు ఫినిషింగ్‌ దశలో ఉన్నాయి. వీటికి మరో రూ.100 కోట్లు కేటాయిస్తే ఇండ్ల నిర్మాణం పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు.ఒక్కో డబుల్‌ ఇంటి నిర్మాణానికి దాదాపు రూ.8 లక్షలు ఖర్చవుతోంది. ఈ ఇండ్లను పేదలకు ఉచితంగా ఇవ్వాలనే ఉద్దేశ్యంతో లబ్దిదారుల వాటాను కూడా ప్రభుత్వమే భరిస్తోంది. అయితే, కేంద్ర ప్రభుత్వం తన వాటా కింద ఒక్కో ఇంటి నిర్మాణానికి లక్షన్నర చెల్లిస్తోంది. మొత్తం ప్రాజెక్టు రూ.8600కోట్లలో ఇప్పటి వరకూ రూ.5200కోట్లను మాత్రమే ఖర్చు చేశారు. ఇదిలా ఉండగా, కేంద్రం వాటా 15 వందల కోట్లలో మొదటి విడత రూ.600 కోట్లను విడుదల చేసింది. లబ్దిదారుల జాబితా సిద్దం చేయనందున రెండో విడత రూ.600కోట్లను కేంద్ర ప్రభుత్వం నిలిపేసింది. ఒకవేళ జాబితా సిద్దం కాగానే, రెండో విడతతో పాటు మూడో విడత రూ.300 కోట్లను కూడా కేంద్రం మంజూరు చేస్తోంది. నిర్మాణ సంస్థలకు దాదాపు 200 కోట్లకు పైగా బిల్లులు బకాయి ఉన్నందున పనులు నిలిపేశారు.గ్రేటర్‌లో ప్రభుత్వం నిర్మిస్తున్న లక్ష ఇండ్లలో ఇప్పటి దాకా 8700 ఇండ్లు మాత్రమే పూర్తయ్యాయి. ఈ ఇండ్లను త్వరితగతిన పూర్తి చేసేందుకు 2019లో జీహెచ్‌ఎంసీ యాక్షన్‌ ప్లాన్‌ను రూపొందించింది. ఈ ప్రకారం 2019 జూన్‌ నాటికి 2280 ఇండ్లు, సెప్టెంబర్‌ నాటికి 26,898 ఇండ్లు, డిసెంబర్‌ నాటికి 25,996 ఇండ్లు, 2020 మార్చి నాటికి 24,301 ఇండ్లు, 2020 జూన్‌ నాటికి 10,622 ఇండ్లు 2020 సెప్టెంబర్‌ నాటికి 2055 ఇండ్లతో మొత్తం ఇండ్లను పూర్తి చేయాలని జీహెచ్‌ఎంసీ ప్రణాళికలు రచించింది. కానీ, జీహెచ్‌ఎంసీ ఎన్నికల కంటే పూర్తి చేసి, ఇండ్లను అందజేస్తే.. 2021 బల్దియా ఎన్నికల నాటికి ప్రజలు మర్చిపోతారనే ఉద్దేశ్యంతోనే డబుల్‌ ఇండ్లను పూర్తి చేయడంలో ప్రభత్వం పెద్దగా పట్టించుకోవడం లేదంటూ పలువురు భావిస్తున్నారు. దీంతో నగరంలో పేదలకు అందాల్సిన డబుల్‌ ఇండ్ల నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతోం

Related Posts