YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

ఇంట్లో  ఏకే 47తో కాల్పులు 

ఇంట్లో  ఏకే 47తో కాల్పులు 

ఇంట్లో  ఏకే 47తో కాల్పులు 
సిద్దిపేట ఫిబ్రవరి 7,
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట లోని  దేవుని సదానందం మరియు గుంటి గంగరాజు కుటుంబల మధ్య ఘర్షణ జరిగింది. ప్రహరి గోడకు సంబంధించి ఇటుకల విషయంలో మాట మాట పెరిగి గొడవ పెద్దగా మారింది.  ఆవేశానికి గురి అయిన సదానందం ఇంట్లో ఉన్న ఏకే-47 గన్ తో గంగరాజు  ఇంట్లోకి వెళ్లి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో గంగరాజు కుటుంబానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఏకే 47 గన్ ఎక్కడి నుంచి వచ్చిందో నని పోలీసులు ఆరా తీస్తున్నారు. కాల్పులతో  గ్రామం అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది.  గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. సదానందం గన్ తో పరారీలో ఉన్నాడు.  నిందితుని కొరకు పోలీసులు గాలిస్తున్నారు. సదానందం కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.

Related Posts