YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం ఆంధ్ర ప్రదేశ్

ఆన్‌లైన్‌లో 72,773 శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు విడుదల 

ఆన్‌లైన్‌లో 72,773 శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు విడుదల 

ఆన్‌లైన్‌లో 72,773 శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు విడుదల          
తిరుమల ఫిబ్రవరి 7 
శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించిన 2020, మే నెల కోటాలో మొత్తం 72,773 టికెట్లను శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేసినట్లు టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. ఆన్‌లైన్‌ డిప్‌ విధానంలో 11,498 సేవా టికెట్లు కాగా, ఇందులో సుప్రభాతం 8,143, తోమాల 120, అర్చన 120, అష్టదళపాదపద్మారాధన 240, నిజపాదదర్శనం 2,875 టికెట్లు ఉన్నాయ‌న్నారు. ఆన్‌లైన్‌ జనరల్‌ కేటగిరిలో 61,275 సేవాటికెట్లు ఉండగా, వీటిలో విశేష‌పూజ 2,000, కల్యాణం 14,725, ఊంజల్‌సేవ 4,650, ఆర్జిత బ్రహ్మోత్సవం 7,700, వ‌సంతోత్స‌వం 15,400, సహస్రదీపాలంకారసేవ 16,800 టికెట్లు ఉన్నాయ‌ని వివ‌రించారు.  తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం జరిగింది. ఇందులో పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు ఈవో సమాధానాలు ఇచ్చారు.

Related Posts