YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు విదేశీయం

మ‌లాలాపై కాల్పులు జరిపిన ఉగ్ర‌వాది జైలు నుంచి పరారి

మ‌లాలాపై కాల్పులు జరిపిన ఉగ్ర‌వాది జైలు నుంచి పరారి

మ‌లాలాపై కాల్పులు జరిపిన ఉగ్ర‌వాది జైలు నుంచి పరారి
కాబుల్ ఫిబ్రవరి 7 
నోబెల్ బ‌హుమ‌తి గ్ర‌హీత పాకిస్థాన్‌కు చెందిన మ‌లాలా యూసుఫ్‌ జాహి ఫై కాల్పులు జరిపిన తాలిబ‌న్ ఉగ్ర‌వాది ఇషానుల్లా ఇషాన్ జైలు నుంచి త‌ప్పించుకున్నాడు. ఈ మేరకు ఇషాన్ ఆడియో క్లిప్‌ ను విడుదల చేసాడు. తాను పోలీసుల చెర నుంచి త‌ప్పించుకున్న‌ట్లు అందులో తెలిపాడు. సోష‌ల్ మీడియాలో ఇప్పుడు ఆ క్లిప్ వైర‌ల్ అవుతోంది. జ‌న‌వ‌రి 11న పోలీసుల అదుపు నుంచి బ‌య‌ట‌ప‌డిన‌ట్లు అత‌ను తెలిపాడు. 2017లో పోలీసులు అత‌న్ని అరెస్టు చేశారు. అయితే త‌నకు ఇచ్చిన వాగ్దానాన్ని పోలీసులు నెర‌వేర్చ‌లేద‌న్నాడు. 2012లో పాక్‌లోని స్వాట్ వ్యాలీలో విద్యా హ‌క్కుల గురించి ప్ర‌చారం చేస్తున్న స‌మ‌యంలో మ‌లాలాపై ఉగ్ర‌వాది ఇషాన్ కాల్పులు జ‌రిపాడు. ఆ కాల్పుల్లో మ‌లాలా త‌ల‌లోకి బుల్లెట్ దిగింది.2014లో పెషావ‌ర్‌లో ఆర్మీ స్కూల్‌పై జ‌రిగిన ఉగ్రదాడికి కూడా ఇషానుల్లే బాధ్యుడు.

Related Posts