YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

వినికిడి లోపం చిన్నారులకు 'శ్రవణం' ఓ వరం 

వినికిడి లోపం చిన్నారులకు 'శ్రవణం' ఓ వరం 

వినికిడి లోపం చిన్నారులకు 'శ్రవణం' ఓ వరం 
- టిటిడి తిరుపతి జెఈవో పి.బ‌సంత్‌కుమార్‌   
తిరుపతి ఫిబ్రవరి 7
మాటలు రాని చిన్నారులకు మాటలతోపాటు విద్యాబుద్ధులు నేర్పి భవిష్యత్తులో వారు సాధారణ పిల్లల్లాగా కొనసాగేందుకు కృషి చేస్తున్న‌శ్రవణం ప్రాజెక్ట్ పిల్ల‌ల‌కు ఓ వ‌రం అని టిటిడి తిరుపతి జెఈవో  పి.బ‌సంత్‌కుమార్‌ తెలిపారు. తిరుపతిలోని శ్రవణం ప్రాజెక్ట్ 14వ వార్షికోత్సవం శుక్రవారం ఉద‌యం పాత మెటర్నిటి ఆసుపత్రి ఆవరణలోని శ్రవణం కేంద్రంలో ఘనంగా జరిగింది.  ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జెఈవో మాట్లాడుతూ శ్రీ‌వారి భ‌క్తులు ఇచ్చిన విరాళాల‌తో టిటిడి నిర్వ‌హిస్తున్న అనేక సేవా కార్య‌క్ర‌మాల‌లో ముఖ్య‌మైన‌ది శ్ర‌వ‌ణం, బ‌ర్డ్‌, స్విమ్స్ ముఖ్య మైన‌వ‌న్నారు. పుట్టుకతో వినికిడిలోపం ఉన్న చిన్నారులను గుర్తించి, వారికి తగిన వినికిడి యంత్రాలు అమర్చి, శిక్షణ ఇచ్చి వారిని సాదారణ స్థితికి తీసుకువచ్చేందుకు శ్రవణం సంస్థ కృషి చేస్తోందన్నారు. అన్నిదానాల‌లోకి విద్యా దానం గొప్ప‌ద‌ని, పిల్ల‌ల‌కు శిక్ష‌ణ ఇవ్వ‌డంలో అధ్యాప‌కుల సేవ‌ల వ‌ల‌న శ్ర‌వ‌ణం సుస్థిర‌స్థానం సంపాదించుకుంద‌న్నారు.      డిసెంబర్‌ 15, 2006లో స్థాపించబడిన ఈ సంస్థ 2008 ఏడాది నుండి ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాలలో 347 మంది పిల్లలకు శిక్షణ ఇచ్చి సాధారణ పాఠశాలలో చేర్పించారని అన్నారు. శ్రవణం సంస్థలో పనిచేస్తున్న సిబ్బందిని జెఈవో అభినందించారు. 

ముందుగా అర్చకులు ప్రార్థన చేశారు. వార్షిక నివేదికను డిఈవో డా.ర‌మ‌ణ ప్ర‌సాద్‌ నివేదించారు. చిన్నారులు నేర్చుకున్న పద్యాలు, పాటలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. శ్రవణం సంస్థ ఇచ్చిన శిక్షణ మూలంగా తమ పిల్లలు వినికిడి లోపం నుండి సాధారణ స్థితికి వచ్చారని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రతిభ కనపరచిన చిన్నారులకు బహుమతులు ప్రదానం చేశారు. అనంత‌రం క్రీడ‌ల‌లో విశేష ప్ర‌తిభ‌ క‌న‌ప‌రిచిన బాలాజిని జెఈవో స‌న్మానించారు.

చిన్నారుల‌కు రూ.9 ల‌క్ష‌ల విలువైన  బిటి హియరింగ్‌ యంత్రాలు విరాళం -

        లూధియానాకు చెందిన మార్క్ హియ‌రింగ్ సెంట‌ర్ యాజ‌మాన్యం  సంజివి గ్రోవ‌ర్‌,  షికా గ్రోవ‌ర్‌, డా.వాణి, డా.విభు,  క‌మ‌లేష్‌లు రూ.9 ల‌క్ష‌ల విలువైన 55 జ‌త‌ల బిటి హియరింగ్‌ యంత్రాలను చిన్నారుల‌కు విరాళంగా అందించారు.   

Related Posts