YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

పేదవాడి ఇంటి కలను కల్లలు చేస్తున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు

పేదవాడి ఇంటి కలను కల్లలు చేస్తున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు

పేదవాడి ఇంటి కలను కల్లలు చేస్తున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు
         పీసీసీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్
హైదరాబాద్ ఫిబ్రవరి 7
పేదవాడి ఇంటి కలను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కల్లలు చేస్తున్నాయని పీసీసీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ విమర్శించారు.శుక్రవారం గాంధీ భవన్ లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ పేదవాడికి ఇళ్ళు కట్టియాలన్న చిత్తశుద్ధి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని దుయ్యబట్టారు.కాంగ్రెస్ ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లకు కేసీఆర్ అవహేళన చేశాడన్నారు.కానీ తాను కట్టిస్తానన్న డబుల్ బెడ్ రూం ఇళ్ళు ఏమైనాయని ప్రశ్నించారు.రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లబ్దిదారుల్లో కేవలం 12 శాతం మాత్రమే పూర్తి చేశారన్నారు.3 జిల్లాలో ఒక్క ఇల్లు కూడా పూర్తి కాలేదని తెలిపారు. నారాయణపేట, వికారాబాద్, కుమరం భీం.6 జిల్లాల్లో 100 లోపు పూర్తి ఐనవి జొగులంబ, నాగర్ కర్నూల్ ,వనపర్తి,మంచిర్యాల,పెద్దపల్లి,రంగారెడ్డి అని తెలిపారు.అసంబ్లీ సాక్షిగా సెప్టెంబర్ 16 2019 మార్చ్ వరకు 2లక్షల ఇండ్లు పూర్తి చేస్తామని అప్పటి గృహ శాఖ  మంత్రి ప్రశాం త్ రెడ్డి అన్నారన్నారు.జీహె్ఎంసీ  పరిధిలో లక్ష ఇండ్లకు 7944 ఇండ్లు పూర్తి చేసారని, తెరాస  ప్రభుత్వం రెండవసారి ఎన్నిక ఐతే సొంత జాగ ఉన్నవారికి 5 లక్షలు ఇస్తామని అన్నారు ఎంత మందికి ఇచ్చారని ప్రశ్నించారు.టిఆర్ఎస్ వొళ్ళు దగ్గరపెట్టుకోని డబుల్ బెడ్ రూమ్   హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు.కేంద్ర ప్రభుత్వం ద్వార ఆర్టీఐ   ద్వార వచ్చిన సమాచారం మేరకు 2014-2018 వరకు 203146 ఇండ్లు ఇచ్చి 1156కోట్లు పీఎంయేవై  గ్రామీణ్ కింద ఇచ్చింది.2016 నుండి 2018వరకు ఒక్క లబ్ది దారుణి కుడా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిక చేయక పోతే కేంద్ర ప్రభుత్వ ఎందుకు 4 సం.నుండి మాట్లాడలేదు.ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట్రానికి వచ్చిన కేంద్ర నిధుల వినియోగంపై కేంద్ర సర్కార్ ఎందుకు ప్రశ్నించలేదో ప్రజలు ఇప్పటికైనా ఆలోచించాలి .. కేసీఆర్ మాయల పకీర్ మాటలను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు.తెలంగాణ ప్రభుత్వంలో అవినీతి జరుగుతుందని ఆరోపిస్తున్న బీజేపీ నాయకులు ఎందుకు విచారణ జరపక పోవడం వెనుకబిజెపి టిఆర్ఎస్ మద్య లోపాయకారి ఒప్పందం ఉందని అర్థమవుతుందన్నారు.తెలంగాణ ఏర్పాటును మోదీ పార్లమెంటులో  అవమానించేలా మాట్లాడారని,తెలంగాణ లో రాజకీయం చేసే నైతికత బీజేపీకి లేదన్నారు.

Related Posts