YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

స్వాతంత్రం అమరులను అవమానించిన ప్రధాని మోడీ:

స్వాతంత్రం అమరులను అవమానించిన ప్రధాని మోడీ:

స్వాతంత్రం అమరులను అవమానించిన ప్రధాని మోడీ: గూడూరు
హైదరాబాద్ ఫిబ్రవరి 7
పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడిన తీరు దేశ స్వాతంత్రం లో ప్రాణాలర్పించిన అమరులను అవమానపరిచేలా ఉందని పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి అన్నారు.శుక్రవారం గాంధీ భవన్ లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ ఢిల్లీ ఎన్నికల్లో ఓడిపోతామనే అసహనం ప్రధాని మోడీ మాటల్లో కనిపిస్తుందన్నారు.మహాత్మా గాంధీని అవమానపరిచేలా మాట్లాడిన బిజెపి  ఎంపీ పై ఎందుకు మోడీ చర్యలు తీసుకోరని ప్రశ్నించారు.గాంధీని అవమానించారంటే దేశ ప్రజలందరినీ అవమాన పరిచినట్లు ..పార్లమెంటు తలుపులు మూసి తెలంగాణ బిల్లును ఆమోదించాలని మోడీ మాట్లాడడం ఇంగితం లేని మాటలు గా ఆయన పేర్కొన్నారు.తెలంగాణపై బీజేపీది సవతి తల్లి ప్రేమ ..పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు బిజెపి మద్దతు అయిష్టంగా ఇచ్చిందా .. తెలంగాణ బిజెపి సమాధానం చెప్పలని గూడూరు డిమాండ్ చేశారు.దేశ విభజనకు నాడు నెహ్రూ సర్కార్ కుట్ర చేసిందంటున్న బీజేపీ నాయకులు .. ఆ సర్కార్ లో శ్యాంప్రసాద్ ముఖర్జీ కూడా భాగస్వామి అనేది మర్చిపోతున్నారన్నారు.అవినీతిని సహించేది లేదంటున్న కేసీఆర్ టీఆర్ఎస్ కార్పొరేటర్ ఉస్మానియా యూనివర్సిటీ భూకబ్జాపై ఎందుకు నోరు మెదపడమ్ లేదన్నారు.ఎన్నికలు వచ్చినప్పుడే కేసీఆర్ కు రైతు సమస్యలు గుర్తుకొస్తాయి ..ఎన్నికలప్పుడు మాత్రమే .. రైతుబంధు గుర్తుకొస్తుందని ఎద్దేవా చేశారు. ..అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ కు సహకరించిన అందుకే రాజ్ కుమార్ కు పదోన్నతి లభించిందన్నారు.

Related Posts