YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ లో పిచ్చి తుగ్లక్ మళ్లీ పుట్టాడు: చంద్రబాబు ఎద్దేవా

ఆంధ్రప్రదేశ్ లో పిచ్చి తుగ్లక్ మళ్లీ పుట్టాడు: చంద్రబాబు ఎద్దేవా

ఆంధ్రప్రదేశ్ లో పిచ్చి తుగ్లక్ మళ్లీ పుట్టాడు: చంద్రబాబు ఎద్దేవా
అమరావతి ఫిబ్రవరి 7
అధికార వికేంద్రీకరణపై మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు కురిపిస్తున్నారు. రోజు రాజధాని గ్రామాల్లో పర్యటిస్తూ రైతుల ఆందోళనలకు మద్దతు తెలుపుతూ వైఎస్సార్సీపీ పాలనపై మండిపడుతున్నారు. అమరావతి నుంచి రాజధాని తరలించి కర్నూల్ విశాఖ పట్టణం లో రాజధానులు ఏర్పాటు చేయడాన్ని ఆయన తీవ్రంగా నిరసిస్తున్నారు. ఈ సందర్భంగా జగన్ పాలన పిచ్చి తుగ్లక్ మాదిరి ఉందని ఎద్దేవా చేశారు. 13వ శతాబ్దంలో పుట్టిన తుగ్లక్ మళ్లీ ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు పుట్టారని వ్యంగ్యంగా విమర్శలు చేశాడు. పాదయాత్ర లో జగన్ ప్రజలను ముద్దుల పెట్టి మోసం చేశారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అనంతపురంలో ఏర్పాటైన దక్షిణ కొరియా ఆటో మైబైల్ కంపెనీ కియా తమిళనాడుకు తరలి పోతుందని సాగిన అవాస్తవాల కథనానికి చంద్రబాబు వంత పాడారు. కియాను తరలించేందుకు కుట్ర పన్నుతున్నారని మండి పడ్డారు. ఈ నేపథ్యం లో జగన్ ముఖ్యమంత్రి గా తీసుకుంటున్న నిర్ణయాలను బాబు తప్పుబట్టారు. రాజధాని మార్పు కియా పరిశ్రమ తరలింపు తదితర అంశాలు పదమూడో శతాబ్దంలో పాలించిన తుగ్లక్ ను గుర్తుచేస్తున్నాయని జగన్ నయా తుగ్లక్ గా మారిండని విమర్శించారు.

పాదయాత్రలో ముద్దులతో ప్రజలను మోసం చేశాడని తను పాదయాత్ర చేసినన్నీ రోజులు కూడా పదవీ కాలంలో జగన్ ఉండడని సంచలన వ్యాఖ్యలు చేశారు. విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్ని తన తన పాలనతో మరింత వెనకబాటు కు వెళ్లేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. వైఎస్సార్సీపీ నాయకులు పిల్ల కుంకలు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా రోజురోజుకు చంద్రబాబు వైఎస్ జగన్ పాలన పై తీవ్ర విమర్శలు చేస్తుంటే జగన్ మాత్రం ఇవేవి పట్టించుకోకుండా తన పంథాన తాను వెళ్తున్నాడు.

Related Posts