YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం విదేశీయం

కరోనా వైరస్ ను కనుగొన్న డాక్టర్ మరణం

కరోనా వైరస్ ను కనుగొన్న డాక్టర్ మరణం

కరోనా వైరస్ ను కనుగొన్న డాక్టర్ మరణం
బీజింగ్  ఫిబ్రవరి 7  
కరోనా పిశాచి గురించి యావత్ ప్రపంచానికి తొలిసారి హెచ్చరించిన వ్యక్తి 34 ఏళ్ల డాక్టర్ లీ వెన్ లియాంగ్ వూహాన్ మరనించారు. కరోనా వైరస్ బారిన పడిన సీఫుడ్ మార్కెట్ కు చెందిన ఏడుగురు వ్యక్తులు తమ ఆసుపత్రిలో చేరారని.. వారిని టెస్టు చేయగా.. సార్స్ బారిన పడినట్లు తేలిందని.. దేశంలో ఈ వైరస్ త్వరలో విస్తరించే ప్రమాదం ఉందని ముందే ఊహించాడు. డిసెంబరు 30న వీ చాట్ గ్రూపులో సదరు డాక్టర్ అందరిని హెచ్చరించాడు.ఈ పోస్టు చేసినందుకు చైనీస్ పోలీసులు ఆయన్ను తెగ ఇబ్బంది పెట్టినట్లు వార్తలు వచ్చాయి. ఈ వైరస్ బారిన పడిన సదరు డాక్టర్.. చికిత్స పొందుతూ తాజాగా మరణించారు. అతడి మరణం పలువురిని విషాదంలోకి ముంచెత్తేలా చేసింది. కరోనా వైరస్ అని అందరి నోటా నానుతున్న వైరస్ కు తాజాగా కొత్త పేరు పెట్టారు. ఎందుకంటే.. కరోనా కుటుంబంలో చాలా రకాలైన వైరస్ లు ఉన్నాయి. ఆ కుటుంబంలోని వైరస్ లలో సార్స్.. మెర్స్ లాంటివి ఉన్నాయి. తాజాగా ప్రపంచాన్ని వణికించేలా విస్తరిస్తున్న ఈ వైరస్ కు ఇప్పటి వరకూ పేరు పెట్టలేదు.ఇటీవల దీన్ని నావెల్ కరోనా వైరస్ (2019 ఎన్ సీవోవీ)గా వ్యవహరించారు. కొన్ని ప్రాంతాల్లో దీన్ని స్నేక్ ఫ్లూ అంటే..మరికొన్ని ప్రాంతాల్లో బ్యాట్ ఫ్లూగా వ్యవహరిస్తారు. ఇలాంటివేళ.. ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఆన్ టాక్సానమీ ఆఫ్ వైరెసెస్ శాస్త్రవేత్తలు ఈ వైరస్ కు పేరు పెట్టారు. దాని పేరును అధికారికంగా ఇంకా ప్రకటించ లేదు. అయితే.. తాము పెట్టిన పేరులో వ్యక్తుల పేర్లు.. ప్రాంతాల పేర్లతో పాటు జంతువుల పేర్లు లేవని చెబుతున్నారు.

Related Posts