రాష్ట్రంలో కరోనా వైరస్ నిర్ధారణ కాలేదు: మంత్రి ఈటెల
హైదరాబాద్ ఫిబ్రవరి 7
ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ నిర్ధారణ కాలేదని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ఆనుమానితుల్లో ఒక్కరికి కూడా కరోనా వైరస్ లేదని పేర్కొన్నారు. పత్రికలు, మీడియా సంయమనం పాటించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. వైద్య బృందం నుంచి పూర్తి వివరాలు నిర్ధారించుకున్న తరువాతనే వార్తలు ప్రసారం చేయాలని కోరారు