YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

విశాఖలో సేంద్రియ ఉత్పత్తుల మేళ

విశాఖలో సేంద్రియ ఉత్పత్తుల మేళ

విశాఖలో సేంద్రియ ఉత్పత్తుల మేళ
విశాఖపట్నం ఫిబ్రవరి 7
విశాఖ నగరంలోని ఆళ్వార్‌దాస్‌ మైదానంలో నేటి నుంచి సేంద్రియ ఉత్పత్తుల మేళా ప్రారంభమైంది. మైదానంలోని ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రైతన్నల నమూనా విగ్రహాలు ఆకట్టుకున్నాయి. రైతు ఉత్సవాల సందర్భంగా మూడు రోజుల పాటు ప్రకృతి పంటల మేళాను గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మేళాను విఎంఆర్ డిఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ రావు ప్రారంభించారు.ఈ మేళా మూడు రోజుల పాటు జరుగనుంది.ఈ మేళాలో రైతులు పండించిన ప్రకృతి వ్యవసాయం , ఆహార ఉత్పత్తులను ప్రదర్శించేందుకు ప్రత్యేకంగా స్టాల్స్ ను ఏర్పాటు చేశారు.ఈ మేళాకు రాష్ట్రంలో పలు ప్రాంతాల నుంచి రైతులు వ్యవసాయ శాస్త్రవేత్తలు హాజరయ్యారు.మొదటి రోజున జరిగిన రైతు సమ్మేళనంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు అధికారులు రైతులకు ప్రత్యేక సూచనలు చేశారు.ఈ సందర్భంగా పలు సేవ సంఘం ప్రతినిధులు తమ అనుభవాలు పంచుకున్నారు.రెండో రోజున ఇంటి ఆవరణలో మొక్కలు పెంపకం అంశంపై పలు సూచనలు చేయనున్నారు.పని మెట్లు,ఎరువుల తయారీ,విత్తనాల ఎంపిక వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు రైతులకు సౌదర్య సాధనాలపై అవగాహన కల్పించనున్నారు.రైతు ఉత్సవాల సందర్భంగా స్లో పాయిజన్ అనే లఘు చిత్రాన్ని ప్రదర్శించనున్నారు.ప్రధానంగా ప్రకృతి ఆధారిత వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించారు.అదేవిధంగా నిర్వహించిన ఎగ్జిబిషన్ లో రైతులకు కావాల్సిన కొత్త వంగడాలను అందుబాటులో ఉంచారు.

Related Posts