YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మునిసిపల్, స్థానిక సంస్థల ఎన్నికలకు సంసిద్ధంగా ఉండాలి 

మునిసిపల్, స్థానిక సంస్థల ఎన్నికలకు సంసిద్ధంగా ఉండాలి 

మునిసిపల్, స్థానిక సంస్థల ఎన్నికలకు సంసిద్ధంగా ఉండాలి 
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ యస్ . రమేష్ కుమార్ 
అమరావతి ఫిబ్రవరి 7 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పట్టణ ప్రాంతంలో మున్సిపల్ ఎన్నికలు మరియు గ్రామీణ ప్రాంతంలోనూ నిర్వహించబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు అనుగుణంగా జిల్లా కలెక్టర్లు తగిన ప్రణాళికలతో సంసిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ యన్ . రమేష్ కుమార్ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్ పీ లు, ఎన్నికల అధికారులకు సూచించారు. శుక్రవారం 13 జిల్లాల కలెక్టర్లు , యస్ పిలు, ఇతర ఉన్నతాధికారులతో విజయవాడలో ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రధాన కార్యాలయం నుండి వీడియోకాన్పరెన్స్ ఆయన నిర్వహించారు . ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్.రమేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ స్థానిక సంస్థల న్నికలకు సంబంధించి నిబంధనలను ,  మార్గదర్శకాలను తూచా తప్పకుండా అమలు చేయడంలో జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి స్వేచ్చగా , ఖచ్చితత్వంతో , పారదర్శకంగా నిర్వహించే దిశలో కలెక్టర్లు క్షేత్రస్థాయిలో చేపడుతున్న చర్యలు సంతృప్తికరంగా ఉందన్నారు. ఎన్నికల నిర్వాహణకు సంబంధించి ముఖ్యంగా 7 అంశాలను దృష్టిలో ఉంచుకోవాలని ఆయన సూచించారు. ఓటర్ల జాబితా యొక్క సవీనీకరణ ( Updation ) మరియు ముద్రణ . బ్యాలెట్ బాక్స్ లు , ఆర్ ఓలు , ఏఆర్‌ఓలు మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని ఇఓలు , ఏఇఓలు పురపాలక సంఘాలు మరియు నగర పంచాయతీల పరిధి లోనూ నియమించడం , ఎన్నికల సిబ్బంది . మరియు మైక్రో అబ్జర్వర్ లను  గుర్తించడం , ఎ న్నికల సామాగ్రి అయిన ఫార్మ్స్ , కవర్లు , హ్యాండ్ బుక్స్ , ఇతర మెటీరియల్‌ను సిద్ధం చేసుకోవడం , బ్యాలెట్ పేపర్ల ముద్రణ , ఎంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వాహణ ప్రక్రియలో ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన నాటి నుండి ఓట్ల లెక్కింపు వరకు తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. 

Related Posts