ముగిసిన ఐటీ సోదాలు
కడప ఫిబ్రవరి 7
కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ఇంటి పైన జరుగుతున్న ఐటి అధికారుల సోదాలు ముగిశాయి. ఈ సోదాలు దాదాపు 30 గంటల పాటు జరిగాయి. కడప నగరంలోని ద్వారకా నగర్ లోని ఆయన నివాసంలో దాదాపు 15 మందితో కూడిన ఇంకమ్ ట్యాక్స్ సభ్యులు సోదాలు చేశారు. కడప తో పాటు హైదరాబాద్ పంజాగుట్ట లో ఉన్న శ్రీనివాసరెడ్డి ఇంటిపై కార్యాలయాల్లోను ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. గత కొన్ని సంవత్సరాలుగా కాంట్రాక్టర్ గా పేరుపొందిన శ్రీనివాసులు రెడ్డి కు చెందిన ఆర్ కె ఇన్ఫ్రా కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ కాంట్రాక్టు పనులను చేస్తుంది. తెలంగాణ మహారాష్ట్రతో పాటు ఇతర ఉత్తర భారత దేశంలోని పలు రాష్ట్రాల్లో కీలక పనులను శ్రీనివాస రెడ్డి చేస్తున్నారు. దీనికి సంబంధించి పన్నులు సరైన రూపంలో కడుతున్నారా లేదా అనే వాటిపై దృష్టి పెట్టిన అధికారులు సోదాలు ముగిసే సమయానికి దాదాపు మూడు బ్యాగులతో కీలక డాక్యుమెంట్లు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లను అధికారులు తమ వెంట తీసుకుని వెళ్లారు. కడప లోని ఆయన నివాసంలో సోదాలు చేస్తున్న సమయంలో కేవలం శ్రీనివాస్ రెడ్డి తల్లి హేమలతమ్మ మాత్రమే ఉన్నారు ఈ సందర్భంగా సోదాల అనంతరం శ్రీనివాసుల రెడ్డి తల్లి హేమలతమ్మ మీడియాతో మాట్లాడుతూ నిన్న, ఈ రోజు మా ఇంట్లో ఐటీ అధికారులు దాడులు చేశారని, వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చానని పేర్కొన్నారు . ఇంట్లో లాకర్ లో ఉన్న కొంత నగదు, బంగారును అధికారులు స్వాధీనం చేసుకున్నారని, వీటితోపాటు స్టేట్ బ్యాంక్ లో ఉన్న లాకర్ను అధికారులు స్వాధీనం చేసుకుని వెళ్లారన్నారు.