డిగ్రీ కాలేజీలకు కూడా నాడు నేడు కార్యక్రమం
అమరావతి ఫిబ్రవరి 7
మన బడి నాడు నేడు పై ముఖ్యమంత్రి సుదీర్ఘ సమీక్ష చేపట్టారు. మొదటి విడత పనులపై పూర్తిగా సమీక్ష చేశారు. స్కూళ్లలో చేపట్టాల్సిన 9 అంశాలపై సమీక్ష చేశారని విద్యాశాఖ మంత్రి అదిమూలం సురేష్ అన్నారు. 300 కోట్ల రివాల్వింగ్ ఫండ్ అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈ నిధులు పేరెంట్స్ కమిటీలకు ఇవ్వడం జరుగుతుంది. డిగ్రీ కళాశాలలకు కూడా నాడు నేడు కార్యక్రమం చేపట్టాలని సీఎం చెప్పారు. పేజ్ 2 కింద డిగ్రీ కళాశాలలు చేపడతాం...1100 కోట్లకు అంచనాలు వేశామని అయన అన్నారు. ఫేజ్ 1 పనులు 15 తేదీ లోపు పనులు ప్రారంభించి జూన్ లోపు పూర్తి చేయాలని సీఎం చెప్పారు. టెండర్లు మార్చ్ 31 లోపు పూర్తి చేస్తాం. ఫేజ్ 2, 3 లు హైబ్రిడ్ యాస్యూటి విధానంలో పనులు చేపడతాం. జూన్, జులై లోపు ఫేజ్ 2, 3 పనులు కూడా ప్రారంభిస్తాం. ఫీజులు, నాణ్యత ప్రమానాలపై నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని మంత్రి అన్నారు. ఫీజు రియంబర్స్ మెంట్ ఇబ్బంది లేకుండా ఇవ్వాలని సీఎం ఆదేశించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఫీజు నియంత్రణ చేపడతాం. గోరు ముద్దలు కింద కొత్త మెనూ అమలులో నాలుగు అంచెల పర్యవేక్షణ వుంటుందని అయన అన్నారు.