మైడ్రీమ్ విజేతలకు బహుమతుల ప్రధానం
విద్యతోనే ఉన్నత శిఖరాలకు
ఎమ్మిగనూరు
ఫిబ్రవరి 7
ఎమ్మిగనూరులో నారాయణ స్కూల్స్ విద్యార్థులు రాయలసీమ స్ధాయిలో జరిగిన మైడ్రీమ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మంచి ప్రతిభ కనబరచారు వారికీ ఎమ్మిగనూరు యస్ ఐ శరత్ కుమార్ రెడ్డి రాయలసీమ విద్యార్థి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రవికుమార్ బహుమతులు ప్రదానం చేసారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యం ఏర్పరచుకుని చదివితే విజయాలు వాటంతట అవే వస్తాయని అన్నారు. ఓటమి అంగీకరించడం అంటే మన లక్ష్యాలను దూరం చేసుకున్నట్టేననీ విద్యార్థులు ఎప్పుడూ విద్యలో ఓటమిని అంగీకరించకూడదని బాగా చదువుకుని ఉన్నతస్థాయి ప్రతిఒక్కరూ చేరుకోవాలని అన్నారు. మైడ్రీమ్ లో విజేతలైన పిల్లలను మెడల్, మొమెంటో, సర్టిఫికెట్ తో అభినందించారు. కార్యక్రమంలో రాయలసీమ విద్యార్థి పోరాట సమితి ఆదోని డివిజన్ అధ్యక్షులు నల్లారెడ్డి, యాదవ్ జాయింట్ సెక్రెటరీ మాలిక్ అకాడమిక్ డీల్ గిరి రవి స్కూల్స్ స్టాఫ్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.