YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి తెలంగాణ

  పకడ్బందిగా ఇంటర్ పరీక్షలు

  పకడ్బందిగా ఇంటర్ పరీక్షలు

  పకడ్బందిగా ఇంటర్ పరీక్షలు
హైదరాబాద్ ఫిబ్రవరి 7  
రాష్ట్రంలో త్వరలో జరుగనున్న ఇంటర్మీడియెట్ పరీక్షలు చాలా ముఖ్యమని ఎలాంటి పొరపాట్లు జరుగకుండా పకడ్బందిగా నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి  సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కొత్తగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తుందని అన్నారు. అదే స్పూర్తితో ఇంటర్మీడియెట్ పరీక్షల నిర్వహణకు అత్యంత ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు. మార్చిలో జరుగు ఇంటర్ పరీక్షలకు జిల్లా కలెక్టర్లు అధికారులతో సమన్వయం చేస్తూ సమర్థవంతంగా నిర్వహించాలని అన్నారు. పరీక్షలు విద్యార్థుల భవిష్యత్తుతో కూడుకున్న విషయమని జాగ్రత్తా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుకుండా పరీక్షలు జరిగేలా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉందని అన్నారు. విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకునుటకు వీలుగా బస్సులను నడిపించాలని ఆర్టీసి అధికారులను ఆదేశించారు. విద్యార్థులు పరీక్షలకు గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా తెలపాలని డి.ఈ.ఓలకు సూచించారు. పరీక్ష పత్రాలను తగిన పోలీస్ బందోబస్తుతో తరలించాలని ఆదేశించారు. పరీక్ష పత్రాలను పోలీస్ స్టేషన్లలో పోలీస్ బందోబస్త్ మధ్య భద్రపరచాలని అన్నారు. పరీక్షల సమయంలో అన్ని పరీక్ష కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమలు చేయాలని కలెక్టర్ల కు సూచించారు. పరీక్షలు వేసవిలో ఉన్నందున విద్యార్థులకు పరీక్ష కేంద్రాలలో త్రాగునీటి వసతి కల్పించాలని, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని, అత్యసవర మందులు, ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి ఫ్లైయింగ్ స్క్వాడ్ లను, చీఫ్ సూపరింటెండెంట్ లను నియమించాలని ఆదేశించారు. జవాబు పత్రాలను ఏరోజుకు ఆరోజు పంపించుటకు వీలుగా పోస్టాఫీసులలో తగిన ఏర్పాట్లు చేయాలని పోస్టల్ అధికారులను ఆమె ఆదేశించారు. ఇంటర్మీడియెట్ పరీక్షలు పూర్తి అయ్యే వరకు అన్నీ పరీక్ష కేంద్రాలలో నిరంతరాయ విద్యుత్ సరఫర చేయాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రాలలో ఫర్నిచర్, టాయిలెట్స్, త్రాగునీరు వసతులను, లైటింగ్ మొదలగు ఏర్పాట్లను ముందుగానే తహశీల్దార్ల ద్వారా తనిఖీ చేయించాలని ఆమె ఆదేశించారు.

Related Posts