YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

 హైదరాబాద్ మెట్రోలో కీలక ఘట్టం.. జేబీఎస్-ఎంజీబీఎస్ మార్గం ప్రారంభం

 హైదరాబాద్ మెట్రోలో కీలక ఘట్టం.. జేబీఎస్-ఎంజీబీఎస్ మార్గం ప్రారంభం

 హైదరాబాద్ మెట్రోలో కీలక ఘట్టం.. జేబీఎస్-ఎంజీబీఎస్ మార్గం ప్రారంభం
హైద్రాబాద్, ఫిబ్రవరి 7 
భాగ్యనగరానికి మణిహారం హైదరాబాద్ మెట్రో రైలులో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. జేబీఎస్, ఎంజీబీఎస్‌ మెట్రో మార్గం ప్రారంభమైంది. మేడారం జాతర నుంచి తిరిగొచ్చిన సీఎం కేసీఆర్ శుక్రవారం (ఫిబ్రవరి 7) సాయంత్రం 4 గంటల 25 నిమిషాలకు ఈ మెట్రో మార్గాన్ని ప్రారంభించారు. అనంతరం అధికారులతో కలిసి మెట్రో రైలులో ప్రయాణించారు. కీలకమైన ఈ మార్గం ప్రారంభంతో మెట్రో మొదటి దశలో 72 కి.మీ.లకు గాను 69 కి.మీ. మార్గం అందుబాటులోకి వచ్చినట్లయింది. దేశంలోనే రెండో అతిపెద్ద మెట్రో వ్యవస్థగా అవతరించింది. ఇప్పటికే ప్రయాణికుల విశేష ఆదరణ పొందుతున్న హైదరాబాద్ మెట్రో ఇకపై సరికొత్త రికార్డులు నెలకొల్పనుంది.మెట్రో మొదటి దశ కారిడార్‌-2లో ఉన్న జేబీఎస్ - ఎంజీబీఎస్ మార్గం మొత్తం 11 కి.మీ. మేర ఉంది. ఈ మార్గంలో 9 మెట్రో స్టేషన్లు వచ్చాయి. కీలకమైన సికింద్రాబాద్ వెస్ట్, గాంధీ ఆసుపత్రి, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, నారాయణగూడ, సుల్తాన్ బజార్, కోఠి తదితర ప్రాంతాలకు మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌తో కలిపే ప్రధాన మెట్రో స్టేషన్ ఈ మార్గంలో అందుబాటులోకి రావడం విశేషం. దీంతో నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బస్సులో గంటన్నర.. మెట్రోలో 16 నిమిషాలు..
జేబీఎస్‌, ఎంజీబీఎస్ మెట్రో మార్గం ప్రారంభంతో కీలకమైన సికింద్రాబాద్, హైద్రాబాద్ మధ్య మెట్రో రైలు కనెక్టివిటీ అందుబాటులోకి వచ్చింది. ఈ మార్గంలో బస్సులో ప్రయాణిస్తే సుమారు గంటన్నర సమయం పడుతుండగా.. మెట్రో రైలులో కేవలం 16 నిమిషాల్లోనే గమ్యం చేరుకోవడం విశేషం. నగరవాసులతో పాటు ఇతర జిల్లాల వారికి కూడా ఇది ఎంతగానో ఉపకరించనుంది. అంతేకాకుండా జేబీఎస్-ఎంజీబీఎస్ మార్గం ప్రారంభంతో అన్ని కారిడార్లలో మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చినట్లయింది. కారిడార్ 1, 2, 3 కలిపి మొత్తం 69 కి.మీ. మేర మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయి.

Related Posts