YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

 అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయిన జాను

 అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయిన జాను

 అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయిన జాను
హైద్రాబాద్, ఫిబ్రవరి 7 
కొన్ని సినిమాలు నాటకీయతతో వచ్చి ప్రేక్షకులను మరోలోకంలోకి తీసుకెళతాయి.విజయాలు అందుకుంటాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం సహజత్వం ఉట్టిపడేలా తెరకెక్కి, ఒక సినిమా చూసిన అనుభూతి కాకుండా కొంతమంది మనుషులను, వాళ్ళ జీవితాల్లో జరిగిన సంఘటనలను పక్కనే ఉండి చూసిన అనుభూతి అందిస్తాయి.అలాంటి ఒక అనుభూతిని అందించే సినిమాగా అందరి ప్రశంసలు అందుకుని విజయంతో పాటు అవార్డులు కూడా దక్కించుకుంది '96'.తమిళ్‌లో మోడరన్ క్లాసిక్ అని పేరు తెచ్చుకున్న ఈ సినిమాని ఇప్పుడు తెలుగులో 'జాను' పేరుతో రీమేక్ చేశారు దిల్ రాజు. తమిళ్‌లో విజయ్ సేతుపతి, త్రిష తమ అభినయంతో ప్రాణం పోసిన జానకి, రామ్ పాత్రలకి తెలుగులో సమంత, శర్వానంద్ ని ఫిక్స్ చెయ్యడం, అలాగే తమిళ్‌లో ఈ సినిమాని తెరకెక్కించిన మేజర్ టెక్నీషియన్స్ ఈ రీమేక్‌కి వర్క్ చెయ్యడం, ట్రైలర్ కూడా ఒరిజినల్ ఫీల్‌ని క్యారీ చెయ్యడంతో ఈ సినిమాపై మంచి పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. మరి 'జాను' ఆ పోజిటివిటీ ఎంతవరకు నిలబెట్టుకుంది?, ప్రేక్షకులనుండి ఎలాంటి ప్రశంసలు దక్కించుకుంది అనేది ఇప్పుడు చూద్దాం. ట్రావెల్ ఫోటోగ్రాఫర్ అయిన రామ్ (శర్వానంద్) చాలా కాలం తరువాత తన సొంత ఊరికి తిరిగివస్తాడు. అక్కడ తాను చదివిన స్కూల్‌కి వెళతాడు. అక్కడికి వెళ్ళిన తరువాత పాత జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటుండగా పాత మిత్రులను కలవడానికి గెట్ టు గెదర్ పెడితే బావుంటుంది అనే ఆలోచన వచ్చి, దానికి ఫ్రెండ్స్ అంతా కూడా ఓకే అనడంతో గెట్ టు గెదర్ డేట్ ఫిక్స్ చేస్తారు. ఆ గెట్ టు గెదర్‌కి అందరితో పాటు జానకి (సమంత) కూడా వస్తుంది. అయితే రామ్‌కి, జానుకి ఒక ఫీల్ ఓరియెంటెడ్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది.వాళ్లిద్దరూ చిన్నప్పటి నుండి ఒకరికి ఒకరు బాగా తెలుసు. అయితే జానకి అంటే రామ్‌కి చాలా ఇష్టం.ఆ ఇష్టం పెరిగి ప్రేమగా మారుతుంది. ఆ విషయం జానకి కి కూడా తెలిసి ఆమె కూడా రామ్‌ని ఇష్టపడుతుంది.కానీ పదో తరగతి ఎక్సామ్స్ పూర్తయి 11 తరగతిలోకి వచ్చేసరికి రామ్ వాళ్ళ కుటుంబం ఊరు విడిచి వెళ్ళిపోతుంది. దాంతో జాను వేరే పెళ్లి చేసుకుంటుంది.రామ్ మాత్రం పెళ్లి చేసుకోకుండా ఉండిపోతాడు. అయితే దాదాపు 15 సంవత్సరాల తరువాత ఎదురుపడిన రామ్, జానకి ఎలా రియాక్ట్ అవుతారు?, వాళ్ళ మధ్య ఏర్పడిన తొలిప్రేమ అనుభవాలను ఎలా గుర్తుచేసుకుంటారు?, చివరికి ఎలాంటి నిర్ణయానికి వస్తారు అనేది ఈ సినిమా కథ.ఈ సినిమా కథ వింటే చాలా సార్లు విన్న, చూసిన కథే కదా మరి దీంట్లో అంత ప్రత్యేకత ఏముంది? అనే సందేహం కలగడం సహజమే. కానీ ఈ సినిమా ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేసింది? అనేది మాత్రం సినిమా చూస్తేనే అర్ధమవుతుంది. ఈ చిన్న పాయింట్‌ని పట్టుకుని దానికి తొలిప్రేమ‌లో ఉండే స్వచ్ఛత‌ని అద్ది, ప్రేమలో ఉండే నిజాయితీతో అలంకరించి వెండితెర సాక్షిగా ఒక మ్యాజిక్ క్రియేట్ చేసాడు డైరెక్టర్ సి.ప్రేమ్ కుమార్. తాను నమ్మిన కథని, కథలో నమ్మిన విషయాన్ని తెరపైకి తీసుకు రావడంలో పూర్తగా సఫలం అయ్యాడు.ఆర్టిస్టులనుండి కూడా మద్దతు లభించడంతో డైరెక్టర్ పని మరింత సులువయింది. 96 ఉన్న ఫీల్ జానులో కనిపిస్తుంది. జాను, రామ్‌ల మధ్య వచ్చే సన్నివేశాలు చాలా వరకు మనసుకు హత్తుకుంటాయి. వాళ్ళ తొలిప్రేమని తలచుకుని వాళ్ళు బాధ పడే సన్నివేశాలు సున్నితంగా గుండెను తాకుతాయి. మధ్య మధ్యలో సహజంగా పుట్టే కామెడీ కూడా హాయిగా అనిపిస్తుంది.అయితే ఇప్పటివరకు చెప్పుకున్నదంతా 'జాను'లోని ఒక కోణం. రెండో కోణం చూస్తే ఈ సినిమా పాయింట్‌లోనే చాలా స్లో నెర్రేషన్‌లో చెప్పాలి అనే నిబంధన ఇమిడిపోయి ఉంది. అందుకే డైరెక్టర్ అనుకున్న ఫీల్ ప్రేక్షకుడికి కన్వే అవ్వడానికి, సినిమా సహజత్వంగా తెరకెక్కించాలి అనే ఆలోచన కూడా తోడయ్యి సినిమా వేగం బాగా మందగించింది. మళ్ళీ ఇందులో కూడా చాలా వరకు ల్యాగ్స్ కూడా ఉన్నాయి. ఒరిజినల్ ఎలా ఉండాలో ఈ సినిమా కూడా అలానే ఉండాలి అనే రూల్ పెట్టుకున్న డైరెక్టర్ సినిమాకి అనవసరమయిన కొన్ని సీన్స్ కూడా అలానే ఉంచేసాడు.సినిమా స్లో గా ఉంది, అలాగే ల్యాగ్స్ ఉన్నాయి అనుకుంటే వీటికి తోడు సినిమాలో ముందు ముందు ఏం జరగబోతుంది అనేది ముందే అర్ధమవుతుంది. ఇలా ఈ మూడు విషయాల్లో మాత్రం సినిమా టీమ్ కాస్త కేర్ తీసుకుని ఉండి ఉంటే జాను కి ఇప్పుడు వచ్చిన ఫలితం కంటే మెరుగయిన ఫలితం దక్కి ఉండేది అనిపిస్తుంది. ఇది రీమేక్ కావడంతో ఒరిజినల్‌తో దీన్ని పోల్చి చూస్తే జాను ఆ సినిమా స్థాయిలో మాత్రం ఉండదు. అలా కాకుండా ఒక ఫ్రెష్ సినిమాగా చూసేవారికి మాత్రం నచ్చే అంశాలు చాలానే ఉన్నాయి.ఈ మధ్య ఏ జోనర్‌లో సినిమా చేసిన కూడా హిట్ పక్కా అన్నట్టు సాగిపోతున్న సమంత ఈ సినిమాలో జానకి పాత్రలో ఒదిగిపోయింది. త్రిష ఎలా చేసింది అని చూసి ఆమెను అనుకరించడం కాకుండా జానకి పాత్రలో ఉన్న ఫీల్‌ని పూర్తిగా ఓన్ చేసుకుని ఆ పాత్రని స్క్రీన్ పై ప్రతిబింబించింది. ఇక శర్వానంద్ కూడా తనకు ఉన్న ఫైన్ యాక్టర్ అనే పేరుని నిలబెట్టుకున్నాడు. 15 సంవత్సరాల తరువాత జాను ఎదురుపడిన సీన్స్‌లో తడబాటు అవసరం. కానీ అక్కడ శర్వానంద్‌లోని నటుడు కూడా కాస్త తడబడినట్టు అనిపించింది. అది తప్పిస్తే మిగతా సినిమా అంతా కూడా శర్వా, సమంతతో పోటీపడి నటించాడు.మెయిన్ కాస్ట్ ఇద్దరూ కూడా సినిమాని తమ భుజాలపై మోస్తే వెన్నెల కిషోర్,శరణ్య ప్రదీప్,తాగుబోతు రమేష్ లాంటి వాళ్ళు కాస్త నవ్వులు పంచారు. ఇక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో రామ్, జాను పాత్రల్లో కనిపించిన టీనేజర్స్ కూడా అద్భుతమయిన నటనతో సినిమాకి ప్లస్ అయ్యారు.మొత్తంగా చూసుకుంటే ఒక క్లాసిక్ అనే స్థాయి సినిమాకి రీమేక్‌గా వచ్చిన జాను ఒరిజినల్‌లోని మ్యాజిక్‌ని రీ క్రియేట్ చెయ్యడంలో చాలా వరకు సక్సెస్ అయ్యింది. కానీ ఒరిజినల్ సాధించిన స్థాయిని అందుకోవడానికి మాత్రం అడ్డంకులు కూడా ఉన్నాయి. ఇలాంటి సినిమాలను ఇష్టపడే వారికి, 96 చూడకుండా ఈ సినిమాకి వెళ్లిన వాళ్ళకు జాను బావుంది అనిపిస్తుంది.మిగతా వాళ్ళకి ఈ సినిమా ఎంతవరకు ఎక్కుతుంది అనేది చెప్పడం కష్టమే.

Related Posts