లెక్కలు తీస్తున్న ఈడీ
విజయవాడ, ఫిబ్రవరి 7
రాజధాని అమరావతిలో జరిగిన ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై దర్యాప్తు చురుగ్గా సాగుతోంది. తాజాగా ఏడుగురిపై సీఐడీ కేసు నమోదు చేసింది. తెల్లరేషన్ కార్డు దారుల పేర్లతో కోట్లాది రూపాయల విలువైలన భూములు కొనుగోలు చేసినట్టు కీలక ఆధారాలను సీఐడీ సేకరించింది. పాన్‌కార్డు లేని పేదలు కోట్లాది రూపాయల చెలామణి చేశారని గుర్తించింది. నాగమణి, నరసింహారావు, అనురాధ, కొండలరావు, భుక్యానాగమణి, అబ్దుల్, జమేదార్‌లపై కేసులు నమోదు చేసినట్టు సమాచారం. ఇప్పటికే మాజీ మంత్రులు నారాయణ, పత్తిపాటి పుల్లారావులపై కేసు నమోదైన సంగతి తెలిసింది. మరికొందరి ప్రమేయంపై విచారణ కొనసాగుతోంది. రాజధాని అమరావతిలో సాగిన ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు సంబంధించి మనీల్యాండరింగ్‌పై దర్యాప్తు చేపట్టిన ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్ట రేట్(ఈడీ) మరో అడుగు ముందుకేసింది. తెల్ల కార్డుదారులు ఎవరికి బినామీలనే కోణంలో ఆరా తీస్తోంది. కోట్లాది రూపాయలతో అక్కడ విలువైన భూములు కొనుగోలు చేసిన పేదల(తెల్లకార్డుదా రుల) జాబితాను సీఐడీ సేకరించడం తెలిసిందే.రాజధాని భూముల ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సీఐడీ అధికారులు విచారణను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా శుక్రవారం ఒక్కరోజే మరో ఏడుగురిపై సీఐడీ అధికారులు కేసులు నమోదు చేశారు.తాజాగా, కేసు నమోదైన వారిలో అబ్దుల్ జమేదార్, పొలినేని కొండలరావు, మండవ నాగమణి, మండవ అనురాధ, బొల్లినేని నరసింహ రావు, భూక్యా నాగమణి ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా తెల్లరేషన్ కార్డు దారుల పేర్లతో కోట్ల రూపాయల విలువైన భూములు కొన్నట్లు సీఐడీ అధికారులు కీలక ఆధారాలు సేకరించిట్లు సమాచారం. రాజధాని ప్రాంతంలో 791 తెల్లరేషన్ కార్డు దారులను వాడుకుని రూ. కోట్లు విలువైన భూములు కొనుగోలు చేశారని ప్రభుత్వం వెల్లడించిన విషయం తెలిసిందే. దీనిపై సీఐడీ ఇచ్చిన వివరాలతో క్రైమ్ నెంబర్ 3/ 2020 కేసు నమోదు చేసిన ఈడీ అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపట్టింది