నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
ముంబై, ఫిబ్రవరి 7
దేశీ స్టాక్ మార్కెట్ పరుగుకు బ్రేకులు పడ్డాయి. దీంతో మార్కెట్ ఈ వారాన్ని నష్టాలతో ముగించింది. బెంచ్‌మార్క్ సూచీలు శుక్రవారం డీలా పడ్డాయి. కరోనా వైరస్ దెబ్బకి అంతర్జాతీయ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం పడింది. దీంతో ఆ ఎఫెక్ట్ మన మార్కెట్లపై కూడా కనిపించింది.అంతేకాకుండా బడ్జెట్ దగ్గరి నుంచి మార్కెట్ 4 శాతం మేర ర్యాలీ చేసింది. ఈ నేపథ్యంలో లాభాల స్వీకరణ కూడా సూచీలపై ప్రభావం చూపింది. చివరకు సెన్సెక్స్ 164 పాయింట్ల నష్టంతో 41,142 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. నిఫ్టీ 40 పాయింట్ల నష్టంతో 12,098 పాయింట్ల వద్ద ముగిసింది.
✺ నిఫ్టీ 50లో జీ ఎంటర్‌టైన్‌మెంట్, ఎన్‌టీపీసీ, కోల్ ఇండియా, ఓఎన్‌జీసీ, యూపీఎల్ షేర్లు లాభపడ్డాయి. జీ ఎంటర్‌టైన్‌మెంట్ దాదాపు 6 శాతం పరుగులు పెట్టింది.
✺ అదేసమయంలో ఐషర్ మోటార్స్, టాటా మోటార్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎంఅండ్ఎం, గ్రాసిమ్ షేర్లు నష్టపోయాయి. ఐషర్ మోటార్స్ 3 శాతానికి పైగా క్షీణించింది.
✺ నిఫ్టీ సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ మిశ్రమంగా క్లోజయ్యాయి. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, నిఫ్టీ ఐటీ, నిఫ్టీ మీడియా, నిఫ్టీ మెటల్, నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌లు లాభపడ్డాయి. ఇక మిగతా ఇండెక్స్‌లన్నీ నష్టపోయాయి. నిఫ్టీ ఫార్మా 1 శాతానికి పైగా పెరిగితే, నిఫ్టీ ఆటో 1 శాతం పడిపోయింది.✺ అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి నష్టపోయింది. 24 పైసలు నష్టంతో ట్రేడవుతోంది. 71.44 వద్ద కదలాడుతోంది.