YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం దేశీయం

....అత్యంత అరుదైన వరాహ దేవాలయం. ..

....అత్యంత అరుదైన వరాహ దేవాలయం. ..

మన పవిత్ర భారత దేశం ఎన్నో వింతలు విశేషాలకు నెలవు. ..అందులో ఒకటి ఈ వరాహ దేవాలయం. .
ఈ దేవాలయం మధ్య ప్రదేశ్ లోని ఖజురహో లో 
నిర్మించినబడ్డది. ..

హిరణ్యాక్షుని బారి నుండి భూమాతను రక్షించడానికి శ్రీమన్నారాయణుడు ఎత్తిన మూడవ అవతారమే. ..
శ్వేత వరాహ అవతారం. ..

హిరణ్యాక్షుడు. ..హిరణ్యకశ్యపుడు. .ఇరువురూ 
అన్నదమ్ములని మనకు తెలిసిన విషయమే. ..
వారి నివాస స్థలం శ్రీశైలం ప్రాంతం. ..అక్కడ వారికి 
కృతయుగంలో బ్రహ్మాండమైన కోట ఉండేది. ..

పరమ భాగవతోత్తముడైన ప్రహ్లాదుని తండ్రి యైన 
హిరణ్యకశ్యపుని..నరసింహ రూపంలో వధించినది 
ఈ ప్రాంతంలోనే. ..ఆ చరిత్ర కు ప్రత్యక్ష నిదర్శనం 
అహోబిలం నరసింహ దేవాలయం. ..
వారి ఇలవేల్పు శ్రీశైల మల్లిఖార్జున స్వామి వారు. .
కృతయుగంలో అక్కడ రాజధాని ఉండేది. ..
ఇప్పడు దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంగా మారిపోయింది. ..కానీ. .శ్రీశైలం. .అహోబిలం 
అలాగే నిలిచి ఉన్నాయి జరిగిన చరిత్ర కు సాక్షీభూతంగా. ..

శ్వేత వరాహ అవతారంలో హిరణ్యాక్షుని 
సంహరించిన తర్వాత స్వామి వారు 
శ్రీశైలం అని మరో పేరుతో పిలవబడే 
పరమ పవిత్రమైన తిరుమల గిరులకు చేరుకున్నారు..అదే తన శాశ్వత నివాస స్థానంగా 
ఏర్పాటు చేసుకున్న విషయం పురాణాలలో వ్యాస భగవానుడి చే లిఖితమైనది. ..

అందుకే తిరుమల ను. ..ఆది వరాహ క్షేత్రమని పిలుస్తారు. ..తిరుమల లో స్వామి పుష్కరిణి పక్కన 
వరాహ స్వామికి దేవాలయం ఉంది. ..తిరుమల యాత్ర లో మొదట వరాహ స్వామినే దర్శించుకోవాలనే నియమం ఉంది. ..

దేశంలో ఎక్కువగా వరాహ ముఖంతో ఉన్న స్వామి వారి దేవాలయాలు ఉంటాయి. ..
ఇలాగ పూర్తిగా వరాహం ఆకారంలో దేవాలయాల 
నిర్మాణం బహు అరుదు. ...

ఓం నమో శ్రీ శ్వేత వరాహ స్వామినే నమ:
ఓం  నమో నారసింహాయ..
ఓం నమో శ్రీ వేంకటేశాయ మంగళం. .

సర్వే జనా సుఖినో భవంతు 
లోకాస్సమస్తా సుఖినో భవంతు ...

Related Posts