ఫేస్ బుక్ తో ఎన్నారై ట్రాప్... 50 లక్షల వసూలు
హైద్రాబాద్, ఫిబ్రవరి 8,
అమెరికాలో ఉంటున్న ఎన్నారై మహిళను ఫేస్‌బుక్ ఫ్రెండ్ పేరుతో ట్రాప్ చేశాడో దుర్మార్గుడు. ఇండియాకు వచ్చిన తరువాత నమ్మకంగా దగ్గరయ్యాడు. కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇచ్చి ఆమెను దారుణంగా రేప్ చేశాడు. ఆ సమయంలో తీసిన వీడియోలను బయటపెడతానంటూ బెదిరించి లక్షల రూపాయల నగదు, బంగారం దోచుకున్నాడు. వేధింపులు భరించలేని బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌లో జరిగింది.కర్ణాటకలోని బీదర్‌కి చెందిన సంజీవ రెడ్డి నిజాంపేటలో నివాసముంటున్నాడు. కొద్దిరోజుల కిందట అమెరికాలో ఉంటున్న నగరానికి చెందిన మహిళకు ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడు. ఆ రిక్వెస్ట్‌ను ఆమె యాక్సెప్ట్ చేయడంతో క్రమంగా పరిచయం పెరిగింది. ఫేస్‌బుక్ నుంచి ఫోన్‌లో మాట్లాడుకునే వరకూ వెళ్లింది. ఓ రోజు ఆమె అమెరికా నుంచి వస్తున్నానని చెప్పడంతో ఎయిర్‌పోర్టుకి వెళ్లి రిసీవ్ కూడా చేసుకున్నాడు.ఆమెపై కన్నేసిన సంజీవ రెడ్డి.. ఎన్నారై మహిళ దగ్గర నుంచి డబ్బులు గుంజాలని పక్కా ప్లాన్ రచించాడు. అమెరికా నుంచి వచ్చి కోకాపేటలో ఉంటున్న ఆమెను.. రెండు రోజుల తర్వాత భోజనానికి రావాలని ఆహ్వానించాడు. అందుకు సమ్మతించడంతో ఆమెను ఓ హోటల్‌కు తీసుకెళ్లాడు. తన భార్య కావేరి, మేనల్లుడు విశాల్ రెడ్డిని ఆమెకి పరిచయం చేశాడు. హోటల్‌కి వచ్చిన ఆమె భోజనం చేసేందుకు నిరాకరించడంతో కూల్‌డ్రింక్ ఆఫర్ చేశాడు. ఆ కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలపడంతో ఆమె స్పృహతప్పింది.మత్తులోకి జారుకున్న మహిళను ముగ్గురూ కలిసి నిజాంపేటలోని తమ ఇంటికి తీసుకెళ్లారు. ఆమెను దారుణంగా రేప్ చేసిన సంజీవ రెడ్డి ఆ తతంగాన్నంతా వీడియోలు తీయించాడు. అప్పటి నుంచి ఆమె వీడియోలు సోషల్ మీడియాలో పెడతానంటూ బ్లాక్‌మెయిల్‌కు దిగడం ప్రారంభించాడు. ప్రతినెలా డబ్బులు వసూలు చేస్తూ వస్తున్నాడు. ఇప్పటి వరకు 30 తులాల బంగారం, చెక్కులతో సహా సుమారు రూ.50 లక్షల వరకూ దోచుకున్నాడు.సంజీవరెడ్డి వేధింపులు భరించలేపోయిన బాధితురాలు బాచుపల్లి పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు సంజీవ రెడ్డి, అతని భార్య కావేరి అదుపులోకి తీసుకున్నారు. మేనల్లుడు విశాల్ రెడ్డిని బీదర్‌లో అరెస్టు చేసి బాచుపల్లి స్టేషన్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.