YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు దేశీయం విదేశీయం

బంగారం...అక్కడ కూడా దాచేసింది

బంగారం...అక్కడ కూడా దాచేసింది

బంగారం...అక్కడ కూడా దాచేసింది
కోల్ కత్తా, ఫిబ్రవరి 8,
మహిళలతో బంగారం అక్రమ రవాణా చేయిస్తున్న నయా స్మగ్లింగ్ దందా వెలుగుచూసింది. సినిమాస్టైల్లో బంగారం స్మగ్లింగ్ చేస్తున్న మహిళను కోల్‌కతా ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పేందుకు ఆమె చేసిన పనిని చూసి అధికారులు విస్తుపోయారు. అరకిలో బంగారాన్ని ఎక్కడ దాచిందో చూసి అవాక్కయ్యారు. బ్యాంకాక్ నుంచి కోల్‌కతా ఫ్లైట్ దిగి వస్తున్న పర్వీన్ సుల్తానా అనే ప్రయాణికురాలి ప్రవర్తనపై ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ సిబ్బందికి అనుమానం వచ్చింది. ఆమెను సెక్యూరిటీ పోస్టు వద్ద నిలువరించి క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అయితే ఆమె లోదుస్తులలో మెటల్ దాచినట్లుగా ఇండికేటర్ నుంచి శబ్దాలు రావడంతో ఆమెను ఇంటర్నల్ చెకప్‌కి తీసుకెళ్లారు.లోపలికి తీసుకెళ్లి ఆమెను తనిఖీ చేసిన మహిళా అధికారులు షాకయ్యారు. కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పి బంగారం స్మగ్లింగ్ చేసేందుకు ఆమె బంగారం దాచిన ప్లేస్ చూసి విస్తుపోయారు. పౌడర్ రూపంలో ఒక ప్యాకెట్‌లో ఉంచిన అరకిలో బంగారాన్ని ఆమె లోదుస్తుల లోపల దాచేసింది. ప్రైవేట్ పార్ట్స్‌‌ వద్ద బంగారాన్ని దాచిన పర్వీన్.. దానికి అడ్డుగా శానిటరీ ప్యాడ్ ధరించింది.పీరియడ్స్‌లో ఉన్నట్లు నమ్మించే యత్నం చేసింది. శానిటరీ ప్యాడ్‌ను తొలగించిన మహిళా అధికారులు అరకిలో బంగారం ఉంచిన ప్యాకెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు చేసిన సెక్యూరిటీ సిబ్బంది.. కస్టమ్స్ అధికారులకు అప్పగించారు.

Related Posts