YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

 భారీగా పెరిగిన మాస్క్ ల విక్రయాలు

 భారీగా పెరిగిన మాస్క్ ల విక్రయాలు

 భారీగా పెరిగిన మాస్క్ ల విక్రయాలు
హైద్రాబాద్, ఫిబ్రవరి 8,
కరోనా వైరస్‌‌ ఎఫెక్ట్‌‌తో ఎన్‌‌95 మాస్కులకు డిమాండ్  బాగా పెరిగింది. ఆ మాస్కులు పెట్టుకుంటే వైరస్  సోకదంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో జనం వాటిని కొనేందుకు ఎగబడుతున్నరు. మాస్క్‌‌ లేకుండా దవాఖానాలకు, జనం బాగా ఉండే చోటికి వెళ్లాలంటే జంకుతున్నరు. మెడికల్  షాపుల్లో ఎన్‌‌95 అందుబాటులో లేకపోవడంతో ఆన్‌‌లైన్‌‌లో ఆర్డర్ చేస్తున్నరు. రాష్ట్ర సర్కారు కూడా 15 వేల మాస్కులకు ఆర్డర్  పెట్టింది. స్టాక్ లేకపోవడంతో కాంట్రాక్టర్లు ఇప్పటివరకూ వాటిని సప్లై చేయలేకపోవడం గమనార్హం. సాధారణంగా స్వైన్‌‌ఫ్లూ వంటి వైరస్ ఇన్ఫెక్షన్‌‌ పేషెంట్లు ఉండే వార్డుల్లో, పెద్ద పెద్ద ఆపరేషన్ల సమయంలో, ఇంటెన్సివ్  కేర్ యూనిట్లలో మాత్రమే ఎన్‌‌95 మాస్కులను వాడుతారు.స్వైన్‌‌‌‌‌‌‌‌ఫ్లూ టైమ్‌‌‌‌‌‌‌‌లో ఎన్‌‌‌‌‌‌‌‌95 మాస్కులు ఎక్కువగా అమ్ముడుపోయినయి. మళ్లీ ఇప్పుడు ఆ మాస్కులు కావాలని అడుగుతున్నరు. ఈ డిమాండ్‌‌‌‌‌‌‌‌తో డూప్లికేట్ ఎన్‌‌‌‌‌‌‌‌95 మాస్కులు కూడా వచ్చినయి.హాస్పిటళ్లకు వచ్చే చాలా మంది మాస్కులు తీసుకుంటున్నారు. సాధారణ మాస్కుల సేల్స్‌‌‌‌‌‌‌‌ కూడా ఇంతకుముందు కంటే బాగా పెరిగింది.                                          ఇతర సమయాల్లో డాక్టర్లు కూడా మామూలు మాస్కులనే పెట్టుకుంటారు. ఢిల్లీ వంటి పొల్యూషన్‌‌‌‌‌‌‌‌ చాలా ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మాత్రమే ఎన్95 తరహా మాస్క్‌‌‌‌‌‌‌‌లు వాడేవారు. ఇప్పుడు దేశమంతటా ఎన్‌‌‌‌‌‌‌‌95 మాస్కులు కొంటున్నారు. ఈ డిమాండ్తో నకిలీ ఎన్‌‌‌‌‌‌‌‌95 మాస్కులు మార్కెట్లోకి వచ్చాయి. వాటినే రూ.150 నుంచి రూ. 200 ధరకు అమ్ముతున్నారు.వచ్చేదీ చైనా నుంచే..ఇండియాలో అతికొద్ది కంపెనీలు మాత్రమే ఎన్‌‌‌‌‌‌‌‌95 మాస్కులను ఉత్పత్తి చేస్తున్నయి. మన రాష్ట్రంలోనైతే ఆ మాస్కులు ఉత్పత్తి చేసే కంపెనీ ఒక్కటి కూడా లేదని స్టేట్‌‌‌‌‌‌‌‌ డ్రగ్‌‌‌‌‌‌‌‌ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌ జాయింట్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  బి.వెంకటేశ్వర్లు తెలిపారు. గుజరాత్‌‌‌‌‌‌‌‌  సహా కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే వాటి ఉత్పత్తి యూనిట్లు ఉన్నాయని చెప్పారు. దాంతో చైనా నుంచే ఎన్‌‌‌‌‌‌‌‌95 మాస్కులు దిగుమతి చేసుకుంటున్నం. ఇప్పుడు అక్కడ్నుంచి ఇంపోర్ట్స్‌‌‌‌‌‌‌‌ ఆగిపోవడం, ఇక్కడ డిమాండ్  పెరగడంతో మాస్కుల ధరలు మూడింతలు పెరిగినయి. కొన్ని మెడికల్ షాపుల్లోనే మాత్రమే అవి అందుబాటులో ఉన్నయి. ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో రూ.200 నుంచి రూ. 2 వేల రేటుతో రకరకాల మాస్కులు దొరుకుతున్నయి.
95 శాతం వరకూ అతిచిన్న పార్టికల్స్‌‌‌‌‌‌‌‌ను, వైరస్‌‌‌‌‌‌‌‌లను ఈ మాస్క్‌‌‌‌‌‌‌‌లు ఫిల్టర్ చేస్తాయి. అందుకే వీటిని ఎన్‌‌‌‌‌‌‌‌95గా పిలుస్తరు. ‘‘ఈ మాస్కులను మనం చైనా నుంచే ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటున్నం. కరోనా ఎఫెక్ట్‌‌‌‌‌‌‌‌తో ఇప్పుడీ మాస్కులు దొరుకుతలేవు. సాధారణ మాస్క్‌‌‌‌‌‌‌‌లు కార్బన్‌‌‌‌‌‌‌‌డయాక్సైడ్‌‌‌‌‌‌‌‌ వంటి పొల్యూషన్‌‌‌‌‌‌‌‌ నుంచి రక్షణ కల్పిస్తే.. ఎన్‌‌‌‌‌‌‌‌95 మాస్కులు వైరస్‌‌‌‌‌‌‌‌ల నుంచి, స్మాలెస్ట్‌‌‌‌‌‌‌‌ పార్టికల్స్‌‌‌‌‌‌‌‌ నుంచి కూడా రక్షణ కల్పిస్తయి. బయటి నుంచి ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను క్లీన్ చేసి లోపలికి పంపిస్తయ్. అలాగని అందరూ వీటినే వినియోగించాల్సిన అవసరమేమీ లేదు. వైరస్‌‌‌‌‌‌‌‌ ఇన్ఫెక్టెడ్ ఏరియాలోకి వెళ్లే వాళ్లు, క్రౌడ్‌‌‌‌‌‌‌‌లో ఎక్కువగా తిరిగేవాళ్లు పెట్టుకోవాలి. జనరల్‌‌‌‌‌‌‌‌గా సర్జికల్‌‌‌‌‌‌‌‌ మాస్కులు పెట్టుకున్నా సరిపోతది. పిల్లలైనా, పెద్దలైనా ఎక్కువగా హ్యాండ్ వాష్‌‌‌‌‌‌‌‌ చేసుకోవడం, దగ్గుతున్నవారికి దూరంగా ఉండడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి” అని అపోలో సీనియర్ పల్మనాలజిస్ట్‌‌‌‌‌‌‌‌ డాక్టర్ మల్లికార్జున్ వివరించారు.

Related Posts