YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

రెండు సీట్లు... ఇరవై మంది పోటీ

రెండు సీట్లు... ఇరవై మంది పోటీ

రెండు సీట్లు... ఇరవై మంది పోటీ
హైద్రాబాద్, ఫిబ్రవరి 8,
ష్ట్రంలో త్వరలో ఖాళీకానున్న రాజ్యసభ, ఎమ్మెల్సీ సీట్ల కోసం టీఆర్ఎస్లో పోటీ పెరిగింది. ఇప్పటికే రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉండగా.. మార్చిలో రెండు రాజ్యసభ సీట్లు, జూన్లో మరో రెండు ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అవుతున్నాయి. దీంతో కొందరు లీడర్లు ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అవకాశమున్న ప్రతిసారి కేసీఆర్, కేటీఆర్ లను కలిసి మనసులోని మాట చెప్తున్నారు. ‘సార్ మాటిచ్చారు.. ఈ సారి పక్కాగా పదవి వస్తది’ అని ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. గవర్నర్ కోటాలో ఒక ఎమ్మెల్సీ స్థానం, నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానం ఖాళీగా ఉన్నాయి. జూన్ చివరికి గవర్నర్ కోటాలోని ఎమ్మెల్సీలు నాయిని నర్సింహారెడ్డి, కర్నే ప్రభాకర్ల పదవీకాలం ముగుస్తుంది. తెలంగాణ కోటాలో రాజ్యసభ సభ్యులుగా ఉన్న కేవీపీ, గరికపాటి మోహన్ రావుల పదవీకాలం మార్చి చివర్లో ముగుస్తుంది. దీంతో ఆరు పదవులు అందుబాటులోకి రానున్నాయి. వాటికోసం 20 మంది లీడర్లు పోటీ పడుతున్నారు.రాజ్యసభకు వెళ్లేందుకు ఇద్దరు మాజీ స్పీకర్లు ఆశగా ఎదురు చూస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు టీఆర్ఎస్లో చేరిన మాజీ స్పీకర్ సురేశ్రెడ్డి.. రాజ్యసభ సీటు కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఈసారి తనకు తప్పకుండా చాన్స్ ఉంటుందన్న ధీమాలో ఉన్నారు. రాజ్యసభ చాన్స్ ఇవ్వకున్నా నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఇస్తారని చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన మాజీ స్పీకర్ మధుసూదనాచారి రాజ్యసభ సీటుపై కన్నేశారు.అసెంబ్లీ ఎలక్షన్లలో ఓటమి చెందిన మాజీ మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, జూపల్లి కృష్ణారావు, చందూలాల్  ఎమ్మెల్సీపై ఆశలు పెట్టుకున్నారు. పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పట్నించి తుమ్మల సీఎం కేసీఆర్ ను రెండు, మూడు సార్లు మాత్రమే కలిశారని, వారి మధ్య దూరమేమైనా పెరిగిందా అన్న కోణంలో పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో రెబల్స్ ను గెలిపించుకున్న జూపల్లి ఎమ్మెల్సీ కోసం ప్రయత్నిస్తున్నారని ప్రచారంలో ఉంది. ఆయనకు పెద్దల ఆశీస్సులు ఉన్నాయని, ఎమ్మెల్సీ ఖాయమని జూపల్లి సన్నిహితులు చెప్తున్నారు. చందూలాల్ ఎమ్మెల్సీ కోసం ప్రయత్నిస్తున్నారు.నిజామాబాద్ మాజీ ఎంపీ కవితను రాజ్యసభకు పంపించే చాన్స్ ఉందని పార్టీవర్గాలు బలంగా చెప్తున్నాయి. లోకసభ రిజల్ట్స్ నాటి నుంచీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటోన్న ఆమెను మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి తేవాలన్న ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్టు ఓ సీనియర్ నేత  చెప్పారు. రాజ్యసభ ఎంపీగా ఉంటూ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఆమె యాక్టివ్ రోల్ ప్లే చేసే అవకాశం ఉందనిపేర్కొన్నారు.ఉద్యమ కాలం నుంచి పార్టీలో ఉన్న నాయకులు వి.ప్రకాశ్, దేవీప్రసాద్, దేశపతి శ్రీనివాస్, తక్కళ్లపల్లి రవీందర్ రావు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. జూన్లో పదవీకాలం ముగియనున్న ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ తనకు మరోసారి చాన్స్ ఉంటుందన్న నమ్మకంలో ఉన్నారు. ఈ మధ్యే పార్టీలోకి వచ్చిన సీనియర్లు మండవ వెంకటేశ్వరరావు, ఉమా మాధవరెడ్డి, ప్రవీణ్ రెడ్డి కూడా ఎమ్మెల్సీ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. సిట్టింగ్ ఎంపీగా ఉండి టికెట్ దక్కని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తనకు రాజ్యసభ సీటుగానీ, ఎమ్మెల్సీగానీ ఇవ్వాలని కోరుతున్నట్టు తెలిసింది.

Related Posts