YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

చంద్రబాబు ను కలిసిన జాతీయ ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ నందకుమార్‌ సాయి

చంద్రబాబు ను కలిసిన జాతీయ ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ నందకుమార్‌ సాయి

అమరావతి : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసిన జాతీయ ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ నందకుమార్‌ సాయి 

పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అందుతున్న సాయం, పునరావాసంపై సంతృప్తి వ్యక్తం చేసిన జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ 

రాష్ట్రం అమలు చేస్తున్న ఆర్, ఆర్ ప్యాకేజీపై కేంద్రానికి త్వరలో నివేదిక ఇస్తామని పేర్కొన్న జాతీయ ఎస్టీ కమిషన్ 

26, 27 తేదీల్లో పోలవరం ప్రాజెక్టును, ముంపుగ్రామాలను సందర్శించినట్టు, పునరావాస గ్రామల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించినట్టు చెప్పిన నందకుమార్‌ సాయి 

ప్రభుత్వ సాయంతో గిరిజనుల స్థితిగతులు మెరుగుపడ్డాయని, అయితే సాధ్యమైనంతగా భూమికి భూమిని పరిహారంగా ఇవ్వాలని సూచించిన జాతీయ ఎస్టీ కమిషన్

సహాయ పునరావాస కార్యక్రమాల కోసం కేంద్రం నిధులను విడుదల చేసేలా ప్రయత్నిస్తాం : ముఖ్యమంత్రితో ఎస్టీ కమిషన్ చైర్మన్ 

పోలవరం ఎన్నో దశాబ్దాల స్వప్నం, దానిని సాకారం చేసేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో వుంది : ఎస్టీ కమిషన్ చైర్మన్‌తో ముఖ్యమంత్రి

భూమిని కోల్పోతున్న గిరిజనులకు భూమిని ఇవ్వడానికే ప్రయత్నిస్తున్నాం, భూమి ఇవ్వడమే కాదు సాగునీటిని నూటికి నూరు శాతం ఇస్తాం : ముఖ్యమంత్రి

ముంపు గ్రామాల్లో ప్రజలకు పునరావాసంతో పాటు విద్య, వైద్యం, నైపుణ్య శిక్షణ, ఉపాధి, పునరావాస కాలనీలకు మౌలిక వసతులు కల్పన చేపట్టాం : ముఖ్యమంత్రి

పోలవరం ప్రాంతంలో ప్రత్యేకంగా ఇండస్ట్రియల్ టౌన్ షిప్ ఏర్పాటుకు కృషి చేస్తాం, ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పేవారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తాం : ముఖ్యమంత్రి

ఒక్క గిరిజన కుటుంబం కూడా నష్టపోకుండా అత్యుత్తమమైన ఆర్, ఆర్ ప్యాకేజీ అందిస్తున్నాం : ముఖ్యమంత్రి

సమీప భవిష్యత్‌లో ఇంతటి భారీ ప్రాజెక్టును భారతదేశంలో నిర్మించే అవకాశం లేదు, పోలవరం నవ్యాంధ్రప్రదేశ్‌కు జీవనాడి : ముఖ్యమంత్రి

Related Posts