YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

వరుస బ్రేక్ డౌన్స్ తో హైడల్ ప్రాజెక్టు

వరుస బ్రేక్ డౌన్స్ తో హైడల్ ప్రాజెక్టు

వరుస బ్రేక్ డౌన్స్ తో హైడల్ ప్రాజెక్టు
ఖమ్మం, ఫిబ్రవరి 8,
పాలేరులో చిన్న తరహా జల విద్యుత్‌ కేంద్రం  30 రోజులుగా పని చేయక పోవడంతో 12 లక్ష ల యూనిట్‌ల విద్యుత్‌కు అంతరాయం కలిగింది. అవకాశం ఉండి విద్యుత్‌ ఉత్పత్తి చేయలేని స్థితి లో పాలేరు జ ల విద్యుత్‌ కేం ద్రం నీరస పడింది. ప్రతీ రోజు రెండు మోటర్లు నడిస్తే రోజుకు 40 వేల యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతుంది. ప్రాజక్టు గత 30 రోజులుగా గేట్‌ కంట్రోల్‌ రాడ్‌ బెండ్‌ అయిన కారణంగా మూత పడింది. వారం రోజుల్లో చేయాల్సిన పనికి నెల పది రోజులు అవుతున్నా ఇంకా ఎప్పుడు పని పూర్తి అవుతుం దో అర్థం కాని పరిస్థితి నెలకొంది. .పాలేరు జల విద్యుత్‌ కేం ద్రంలో గేట్‌ కంట్రోల్‌ రాడ్‌ బెడ్‌ అవ్వడంతో నెల  రోజులుగా విద్యుత్‌ ఉత ్పత్తి నిలిచి పోయింది. అవకాశం ఉండి కేవలం రాడ్‌ బెడ్‌ కారణంగా ఉత్పత్తి చేయలేని దుస్థితిలో ఉం ది. రిజర్వాయర్‌ నీటి మట్టం 18 అడుగులు ఉండి కిందకు 1,200 క్యూసెక్కుల నీరు విడుదలైతే ఒక యూనిట్‌ విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతుంది. రెండు యూనిట్‌లు నడవాలంటే 18 అడుగుల నీటి మట్టం ఉండి 2,400 క్యూసెక్కుల నీరు కిందకు వదలాల్సి ఉంటుంది. ప్రస్తుతం నీటి మట్టం 20 అడుగులు ఉండి కింద కు 4,800 క్యూసెక్కుల నీరు విడుదల అవుతున్నా  ఒక్క యూనిట్‌ నడపలేని పరిస్థితి నెలకొంది. పాలేరులో రెండు యూనిట్లు (మోటార్లు) పని చేస్తే రోజుకు 40 వేల యూనిట్‌ల విద్యుత్‌ ఉత్ప త్తి చేసే ప్రాజెక్టు సుమారు 30 రోజులుగా సుమా రు 12 లక్షల యూనిట్‌ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయలేక పో యింది. ఉత్పత్తి అయిన యూనిట్‌ సుమారు రూ.4 వరకు మార్కెట్‌లో విక్రయిస్తా రు. 30 రోజుల్లో జరిగిన నష్టం నష్టం సుమారు రూ.45 లక్షలపైన ఉంటుందని అంచానా.పాలేరు జలాశయంపై ప్రధాన కాలువకు అనుసంధానంగా మరో కాలువను తవ్వి దానిపై చిన్నతరహా జలవిద్యుత్‌ కేంద్రాన్ని 1993లో ఏర్పా టు చేశారు. రెండు యూనిట్లతో కరెంట్‌ను ఉత్ప త్తి చేసే విధంగా ప్రాజెక్టు నిర్మించారు. రిజర్వాయ ర్‌ నీటి మట్టం ఆధారంగా ఉత్పత్తి జరుగుతుంది. కనీసం నీటి మట్టం 18 అడుగులు ఉంటే విద్యత్‌ ఉత్పత్తి అవుతుంది. వానాకాలం, వేసవికాల పం టల సాగు కోసం ఆయకట్టుకు నీరు వదిలే సమాయంలో మాత్రమే విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతుంది. మిగిలిన సమయాల్లో ఖాళీగా ఉంటుం ది. నీరు వదిలిన సమయాల్లోనూ అవాంతరాలతో ఉత్పత్తి నిలిచిపోయింది. కంట్రోల్‌ రాడ్‌ మరమ్మతు కోసం హైద్రాబాద్‌ పంపి వారాలు గడుస్తున్నా ఇంకా ఎప్పుడు వస్తుందనే దానిపై స్పష్టత లేదు. కృష్ణా జలాలు సక్రమంగా రాక ఇబ్బందులు జరుగుతుంటే అంతా అనువుగా ఉన్న సమయాల్లో అవాంతరాలతో నష్టం జరుగుతోందని పలువురు పేర్కొంటున్నారు.  ప్రాజెక్టులో ఏవైనా సమస్యలతో బ్రేక్‌ డౌన్స్‌ ఉంటాయి. కానీ అవకాశం ఉండి కూడా అధికారులు సరైన శ్రద్ధ పెట్టని కారణంగా ఉత్పత్తి నిలిచి పోయింది. జనవరి నెల మొత్తం అవకాశం ఉన్నా విద్యుత్‌ను ఉత్పత్తి చేయలేక పోయారు. గతంలో ప్రాజెక్టులో అనేక సమస్యలతో ఉత్పత్తి చేయలేక పోయారు. ప్రస్తుతం అన్నీ ఉన్నా ఉత్పత్తి నిలిచి పోయింది. వాస్తవంగా 50 రోజుల కిందట గేట్‌ రాడ్‌ బెండ్‌ అయ్యింది. అందులో 30 రోజులు ఉత్పత్తికి అనువుగా ఉండి నష్టం జరిగింది. మరమ్మతుల నిమిత్తం పంపిన గేట్‌ రాడ్‌ వచ్చేందుకు మరికొంత సమయం పడుతుందని సమాచారం.

Related Posts