మేడారంలో కేంద్ర మంత్రి పూజలు
మేడారం ఫిబ్రవరి 8
మేడారం సమ్మక్క - సారలమ్మ లను దర్శించుకునేందుకు వచ్చిన కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండాకి, రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి లకు స్వాగతం పలికారు. అయనకు రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ - శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే సీతక్క, అధికారులు అమ్మవార్ల కి, దర్శనం చేయించారు. మేడారం జాతరను జాతీయ పండగ గా గుర్తించాలని, మేడారం అభివృద్ధికి నిధులు, గురుకులాలు కేటాయించాలని కోరుతూ కేంద్రమంత్రికి వినతి పత్రం ఇచ్చారు. జాతీయ పండుగగా గుర్తించాలని ఎన్నో ఏళ్లుగా కోరుతున్నా ...కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.ఇప్పటికైనా మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం పోచంపల్లి కండువాలు, శాలువా కప్పి, జ్ఞాపికను అందించి సన్మానం చేశారు.