YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 జగన్ సంక్షేమ వ్యతిరేకి

 జగన్ సంక్షేమ వ్యతిరేకి

 జగన్ సంక్షేమ వ్యతిరేకి
అమరావతి ఫిబ్రవరి 8 
ఒక్క అవకాశం ఇచ్చినందుకు ఎన్ని కష్టాలో, నష్టాలో, అనర్థాలో! రివర్స్ టెండరింగ్ పేరుతో బడుగు, బలహీన వర్గాలకు టెండర్ పెడుతున్నారు జగన్ గారు. పేద ప్రజల పట్ల ఆయనకి ఉన్న వ్యతిరేకతని పెంచుకుంటూ పోతున్నారు. 7 లక్షల పెన్షన్లు ఎత్తేసారని టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు వ్యాఖ్యానించారు. ఈ మేరకు అయన శనివారం ట్వీట్టర్ లో కామెంట్స్ పెట్టారు. మొన్నటి వరకూ ఒక్క పెన్షన్ కూడా తియ్యలేదు అని బుకాయించిన వైకాపా ప్రభుత్వం, రీ వెరిఫికేషన్ పేరుతో కొత్త డ్రామా ఎందుకు మొదలుపెట్టింది ? ఇప్పుడు 20 లక్షల రేషన్ కార్డులు ఎత్తేసి పేదవాడి నోటి దగ్గర కూడు లాగేసుకోవడానికి మనసెలా ఒప్పింది జగన్ గారు ? మీరు ఊరుకో రాజభవనంలో ఉండొచ్చు.పేద వాడు అద్దె ఇంట్లో ఉన్నా చెత్త రూల్స్ పెట్టి రేషన్ కార్డు తీసేస్తారా ?  పేద వాడి పొట్ట కొట్టి రూ.1500 కోట్లు మిగుల్చుకొని ఏం సాధిస్తారని ప్రశ్నించారు. ఇంత పెద్ద ఎత్తున పెన్షన్లు, రేషన్ కార్డులు ఎత్తేస్తున్న జగన్ గారు సంక్షేమ వ్యతిరేకిగా చరిత్రలో మిగిలిపోతారని అయన వ్యాఖ్యానించారు. 

Related Posts