YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

వచ్చే వారంలో సల్మాన్ ఖాన్ భవితవ్యం.. 

Highlights

ఏప్రిల్ 5న తీర్పునివ్వనున్న జోథ్‌పూర్ కోర్టు 

వచ్చే వారంలో సల్మాన్ ఖాన్ భవితవ్యం.. 

20 ఏళ్ల క్రితం నాటి కృష్ణ జింకల వేట కేసు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ భవితవ్యం వచ్చే వారంలో తేలనుంది. కృష్ణ జింకలను వేటాడిన కేసులో ఏప్రిల్ 5న జోథ్‌పూర్ కోర్టు తీర్పును వెలువరించనుంది. ఈ కేసులో సల్మాన్ ఖాన్‌తో పాటు నటీనటులు సైఫ్ అలీఖాన్, నీలం, టబూ, సోనాలి బింద్రే, దుష్యంత్ సింగ్ నిందితులుగా ఉన్నారు. 1999లో సూరజ్ బర్‌జ్యాత్య చిత్రం 'హమ్ సాథ్ సాథ్ హై' షూటింగ్ సమయంలో రాజస్థాన్‌లోని కంకణి గ్రామంలో రెండు కృష్ణజింకలను వీరు వేటాడినట్టు ఆరోపణలున్నాయి. కృష్ణ జింకలను వేటాడటంపై స్థానిక బిష్ణోయ్ వర్గీయులు నిరసనలకు దిగడంతో సల్మాన్ తదితరులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Related Posts