ముగిసిన మేడారం జాతర..
జనవరి 8
అసియాలోనే గిరిజన జాతరయిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర శనివారం విజయవంతంగా ముగిసింది. మేడారం సమ్మక్క సారలమ్మ దర్శించుకోనేందుకు తరలివచ్చే భక్తులకు అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం సౌకర్యాలు కల్పించడంలో సఫలమయ్యారు. సామాన్న భక్తుడు నుండి వి.వి.ఐ.పి స్థాయి భక్తుడు వరకు సకాలంలో అమ్మవార్ల దర్శించుకోని తమ మొక్కులను చెల్లించుకోడంతో అందరూ అభినందలు తెలిపారు. ముఖ్యంగా జాతర రోజుల్లో సమయపాలన లేకుండా వాహనాలు తరలివచ్చి వెళ్ళే మార్గాలను వ్యక్తిగతంగా సందర్శించి ఎలాంటి ట్రాఫిక్ జామ్ సమస్యలు రాకుండా తగుజాగ్రత్తలు తీసుకోవడంతోపాటు సంబంధించిన సెక్టార్ ల్లో అధికారుల విధులు అందరి ప్రశంసలు అందుకున్నాయి.