YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పిచ్చోడి చేతిలో రాయి చందంగా పరిపాలన

పిచ్చోడి చేతిలో రాయి చందంగా పరిపాలన

పిచ్చోడి చేతిలో రాయి చందంగా పరిపాలన 
విశాఖపట్నం జనవరి 8  
ఆంధ్ర రాష్ట్రంలో బాధాకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 8 నెలలు అయ్యింది..ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పిచ్చోడి చేతిలో రాయి లా తయారయింది రాష్ట్ర పరిస్థితని మాజీమంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు. శనివారం అయన మీడియాతో మాట్లాడారు. నా రాజకీయ జీవితంలో ఇలాంటి ముఖ్యమంత్రి ని చూడలేదు. ఆయన నిర్ణయాలు వల్ల రాష్ట్రం చాలా నష్ట పోయింది. ప్రజలు కూడా ఈ పరిపాలన పై ఆలోచిస్తూ న్న పరిస్థితి ఉంది. రాష్ట్రం వెనక్కి వెళ్లి పోయింది.  చంద్రబాబు పై కక్ష పురితంగా వెళ్తూ న్నారు. రాజదాని ని ఏ ప్రాంత ప్రజలు అడిగారు. ఆనాడు అసెంబ్లీ లో కూడా అమరావతి రాజధాని అని ఒప్పుకున్నావ్. ఒకటే రాష్ట్రం ఒకటే రాజధాని గా ఉండాలని అయన అన్నారు. బొత్స వారి ప్రాంతాల గురుంచి మాట్లాతున్నారు ఆనాడు మంత్రి గా ఉన్నపుడు ఎందుకు ప్రాంతాల అబివృద్ది ఎందుకు గుర్తుకు రాలేదు. దమ్ము ఉంటే హై కోర్ట్ అసెంబ్లీ సచివాలయం అని విశాఖ లో నే పెట్టండి. విశాఖ పై అంత ప్రేమ ఉంటే పరిశ్రమ లు తీసుకురండి. రాజధాని మార్పు చిన్న విషయం కాదు..అమరావతి కో 33 వేల ఎక్కరాలు రైతులు ఇస్తే సమాధానం చేపవల్సిన అవసరం లేదా...50 రోజుల నుండి రైతులు ఆందోళన చేస్తే ఒకరైన వారి సమస్య పరిష్కారం చేసారా. అసెంబ్లీ కి దొడ్డి దారిన వెళ్తూ న్న పరిస్థితి ఏర్పడింది కోర్ట్ కి మాత్రం రాజా మార్గం లో వెళ్తున్నావ్. ఎక్కడ చూసినా పోలీసులే ...ఇది ప్రజా స్వామ్యమా పోలీసుల స్వామ్యమా. రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితి కూడా బాగో లేదు. రాష్ట్రంలో రకరకాల కారణాల చెప్పి పెన్షన్స్ తెసేసావని విమర్శించారు. మద్యం రేట్లు కూడా దారుణంగా పెంచేశావ్. ఆ పెంచిన ఆదాయం అమ్మఒడి రూపం లో ఇస్తున్నావ్. అమరావతి లో ల్యాండ్ పూలింగ్ తప్పు అని ఆనాడు మీరే చెప్పారు. మరి మీరు ఎందుకు ల్యాండ్ పూలింగ్ చేస్తున్నారు. విజయ్ సాయి రెడ్డి విశాఖలో ఎందుకు ఇళ్ళు తీసుకొని ఉంటున్నారు. రాష్ట్రంలో ఎక్కడ భూములు లేవు. ఒక్క విశాఖ లో నే భూములు దోచుకోవడానికి ఉన్నారు. ఏ తప్పు చేశాను నా మీద కేసు పెట్టారు. పరిపాలన విధానం బాగోలేక ప్రజలను తప్పు పట్టించే విధంగా రాజధాని మార్పు అని రాజకీయం చేస్తున్నారు. కేంద్ర బడ్జెట్ లు 2 అయ్యాయి ఇప్పటికి మీ ఎంపీ లు పార్లమెంట్ లో ప్రత్యేక హోదా గురించి ఆడిగారా. నవరత్న లు కు డబ్బులు లేక విశాఖ 2 వేల ఎక్కరాలు అమ్మి ఖర్చు పెడుతున్న పరిస్థితి నెలకొందని అన్నారు. నీలాగా వీరవీగిన వారు మట్టిలో కలిసిపోయిన్న పరిస్థితి లు ఉన్నాయ్..నీకు అదే పరిస్థితి వస్తుంది..పోలీస్ వ్యవస్థ ని నేడు బ్రష్టుపట్టించావ్. సృజల స్రవంతి పనులు ఎందుకు అగాయి. దీనికి గురుంచి మాట్లాడం కూడా లేదు. బొత్స మంత్రి గా ఉన్నపుడు ఓక్స్ వేగన్ పరిశ్రమ ఎందుకు ఆనాడు ఎందుకు ఈ ప్రాంతం నుండి వెళ్లి పోయింది. రాజధాని మార్పు అనేది చిన్న విషయం కాదు ఇది మేజర్ ప్రాబ్లెమ్. రాష్ట్రంలో సమస్య వచ్చినప్పుడు పరిస్కారం చేసే బాధ్యత కేంద్రానికి ఉందని అయన అన్నారు.

Related Posts