YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

అభివృధి పనులను వేగవంతం చేయాలి

అభివృధి పనులను వేగవంతం చేయాలి

అభివృధి పనులను వేగవంతం చేయాలి  ఢిల్లీ తరహాలో వర్షపు నీటి కాలువను నిర్మించాలి
అధికారులకు ఉపసభాపతి పద్మారావు గౌడ్ ఆదేశం
సికింద్రాబాద్, జనవరి 8  
సికింద్రాబాద్ పరిధిలో తాజాగా వివిధ అభివృధి పనులకు నిధులు మంజురయ్యయని, జీహ్చ్ ఎంసి  ద్వారాగా రోడ్ల పునర్నిర్మాణం, కల్వర్టుల ఆధునీకరణకు కేటాయించిన రూ.ఐదు కోట్ల కు పైగా నిధులతో వివిధ పనులను వెంటనే పూర్తి చేయాలనీ రాష్ట్ర ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సితఫలమంది డివిజన్ పరిధిలో శనివారం జీహెచ్ఎంసీ ఉప కమీషనర్ రవికుమార్, కార్పోరేటర్  సామల హేమ, అధికారులు, నేతలతో కలిసి వివిధ అభివృధి పనులను పద్మారావు గౌడ్ ప్రారంభించారు. శాంతా శ్రీరామ్ అపార్ట్మెంట్స్ వద్ద రూ.50 లక్షల ఖర్చుతో రేటైనింగ్ వాల్ నిర్మాణం పనులు, ఫ్రైడే మార్కెట్, షాబాజ్ గుడా ల వద్ద రూ.20 లక్షల ఖర్చుతో నాలా పై కల్వర్టుల నిర్మాణం పనులను ప్రారంభించారు.  ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ 50 సంవత్సరాలుగా అపరిష్కృతంగా నిలిచిన అన్ని సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తున్నామని తెలిపారు. నాలాల వల్ల ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు జరిపామని తెలిపారు.  బస్తీల్లో పర్యటన మొహమ్మద్ గూడా, షాబాజ్ గూడా ప్రాంతాల్లో పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా పాదయాత్ర నిర్వహించారు. షాబాజ్ గూడా వద్ద మంచి నీరు పొంగి రోడ్ల పై నిలిచిన పరిస్థితిని గుర్తించారు. నీరు నిలిచిపోకుండా డిల్లి తరహాలో వరద నీటి కాలువను నిర్మించాలని అయన అధికారులను ఆదేశించారు. అదే విధంగా పలువురు స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకొని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ ఈ ఈ ప్రమోద్ కుమార్, డిప్యూటీ ఈ ఈ పరమేష్, జలమండలి డీజీయెం కృష్ణ లతో పాటు వివిధ బస్తిల నేతలు పాల్గొన్నారు . 

Related Posts