YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్ విదేశీయం

శ్రీలంక అధ్యక్షుడి రాకకు ఏర్పాట్లు

శ్రీలంక అధ్యక్షుడి రాకకు ఏర్పాట్లు

శ్రీలంక అధ్యక్షుడి రాకకు ఏర్పాట్లు
రేణిగుంట, ఫిబ్రవరి 08 
ఈ నెల 10 న తిరుమల శ్రీవారి దర్శనార్థం రానున్న  శ్రీలంక ప్రధాని మహింద రాజపక్షే కు   రాష్ట్ర సంస్కృతి, సాంప్రదాయ స్వాగతం పలకాలని, పర్యటన ఏర్పాట్లు పగడ్బందీగా వుండేలా చూడాలని జిల్లా కలెక్టర్ డా.భరత్ గుప్త అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం జిల్లా కలెక్టర్  రేణిగుంట విమానాశ్రయంలో ముందస్తు ఏర్పాట్ల పరిశీలించి పలు సూచనులు చేశారు. ఈ నెల 10 న రాత్రి 7 .20 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకొనున్నారని శ్రీలంక ప్రధాని తో పాటు ఆదేశ  మంత్రులు ఎ.తొండమాన్ , కె.ఎన్.దేవనంద  ప్రధాని కార్యాల అధికారులు చేరుకుంటారని అన్నారు. ప్రయాణించే రహదారుల్లో ప్రభుత్వం తరుపున స్వాగత హోర్దింగ్స్ ఏర్పాటు , బద్రత పటిష్టంగా వుండాలని, కాన్వాయ్ నందు ఆంబులెన్స్ తో పాటు డాక్టర్లు , రహదారుల వెంట అవసరం వున్న చోట బారికేడ్స్ ఏర్పాటు చేయాలని అన్నారు. తేది.11 న రాత్రి శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొని ఆదేరోజు ఉదయం 11 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని శ్రీలంక తిరుగుప్రయాణం కానున్నారని తెలిపారు. కలెక్టర్ పర్యటనలో జెసి 2 చంద్రమౌళి, ఆర్డీఓ కనక నరసా రెడ్డి, ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ సురేష్, చీఫ్ సెక్యూరిటీ అధికారి రాజశేఖర్ రెడ్డి, డిప్యూటీ కమాండెంట్ శుక్ల, భద్రత కోసం పర్యవేక్షించనున్న డిఎస్పీలు కెవివిఎస్ ప్రసాద్, కాటమరాజు, డి ఈ లు ఎన్.హెచ్ సత్యమూర్తి, ఆర్ అండ్ బి సహదేవ రెడ్డి, బిఎస్ ఎన్ ఎల్ జయశంకర్, ఐపి ఆర్ గురుస్వామి ,ఇన్స్పెక్టర్లు ,అధికారులు పాల్గొన్నారు. 

Related Posts